Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాయిరాం డిగ్రీ కాలేజీ డైరెక్టర్ సంధ్యారాణి
నవతెలంగాణ-మోత్కూరు
మున్సిపల్ కేంద్రంలోని సాయిరాం డిగ్రీ, జూనియర్ కళాశాలలను తనకు తెలియకుండానే ఇతరులకు ఎలా అమ్ముకుంటారని, కాలేజీ కొన్నవారి పై, లీజుకు తీసుకున్న వారిపై తాను చట్టపరంగా చర్యలు తీసుకుంటానని సాయిరాం డిగ్రీ కళాశాల డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ మర్రి సంధ్యారాణి తెలిపారు. బుధవారం పట్టణకేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2005లో తాను కాలేజీలో డైరెక్టర్ ఉండి పని చేస్తున్నానని, పదేళ్లు ప్రిన్సిపాల్‌గా, ఐదేళ్లు వైస్ ప్రిన్సిపాల్‌గా పని చేశానని తెలిపారు. సాయి డివైన్ ఎడ్యుకేషన్ సొసైటీలో కూడా తాను మెంబర్‌గా ఉన్నానని, తనకు సమాచారం ఇవ్వకుండా కాలేజీ చైర్మెన్ జూనియర్ కాలేజీని ఇతరులకు అమ్ముకున్నారని, డిగ్రీ కాలేజీని మోత్కూరులోని మరో కళాశాల యాజమాన్యంకు లీజుకు ఇచ్చారని తెలిపారు. విద్యా సంవత్సరం ముగియకుండా మధ్యలో ఎలా లీజుకు ఇస్తారని ప్రశ్నించారు. యూనివర్సిటీకి, యూనియన్‌కు ఫిర్యాదు చేశానన్నారు. కాలేజీలో న్యాయపరంగా తనకు వచ్చే వాటాను తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చైర్మెన్ సంతోష్‌రెడ్డి వివరణ : కళాశాలలు నష్టాల్లో ఉండటం కారణంగానే జూనియర్ కాలేజీని అమ్మాం. డిగ్రీ కాలేజీని లీజుకు ఇచ్చాం.