Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-మునుగోడు
మండలంలోని కొరటికల్ గ్రామంలో పల్లె ప్రగతి కనిపించడంలేదు. పచ్చదనం, పరిశుభ్రత ఎక్కడా కనిపించడంలేదు. పల్లె ప్రగతి పనులను పర్యవేక్షించాల్సి అధికారులు అలసత్వం వహిస్తున్నారు. పల్లెలను పచ్చని చెట్ల తో ఏర్పాటుకు చేసేందుకు కు ప్రతి ఏటా హరితహారం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చిస్తోంది. ఒక్క మొక్క పెంచడం, గుంతలు తీసి మొక్కను నాటడం, ట్రీ గార్డ్ లను ఏర్పాటు చేయడం ఇవన్నీ కలిపి ఒక మొక్క కోసం 190 ఖర్చు చేస్తున్నప్పటికీ గ్రామ సర్పంచ్, కార్యదర్శి నిర్లక్ష్యం వల్ల మొక్కలు కల్పించాల్సిన రక్షణ కల్పించడంలేదు. గూడపూర్ నుండి కొరటికల్ గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కల పెంపకం గాలికి దీపం పెట్టి దేవుడా కాపాడు అన్న చందంగా మొక్కల పెంపకం చేపడుతున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా పర్యవేక్షణకు వెళ్తున్న అధికారులు ఎలాంటి చర్యలకు తీసుకోకపోవడం గమనార్హం.
పట్టపగలు వెలుగుతున్న విద్యుత్ దీపాలు
గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద పట్టపగలే విద్యుత్ దీపాలు వెలుగుతున్న పల్లె ప్రగతి లో భాగంగా గ్రామం లో పర్యటిస్తున్న పాలకులకు పర్యవేక్షణ అధికారులకు పట్టింపు లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ ద్వారా వేల రూపాయలు కరెంటు బిల్లులు చెల్లిస్తామని చెప్పుకుంటున్న పాలకులకు విద్యుత్ చార్జీలు తగ్గించుకునేందుకు ప్రయత్నం ఎందుకు చేస్త లేరని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఎస్సీ కాలనీలోని 11,12 వార్డుల్లో మురుగు నీరు ను వాగులో చేర్చేందుకు ఓ వ్యక్తి తమ సొంత భూమి నుండి నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించినప్పటికీ నిర్మాణం చేపడతామని గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన పాలకులు ఇంతవరకు పనులు చేపట్టలేదు. ఇప్పటికైనా పాలక ,పర్యవేక్షణ ,అధికారులు గ్రామంలో నెలకొన్న సమస్యల ను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.