Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
మండలంలోని కొరటికల్ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు.బుధవారం ఆ గ్రామంలో నిర్వహించిన మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న మిషన్ భగీరథ పథకం రాష్ట్రంలోనే మొట్ట మొదటిగా ప్రారంభించిన మునుగోడు నియోజకవర్గంలో నేటికీ మిషన్ భగీరథ నీటిని నోచని గ్రామాలలో ఎన్నో ఉన్నాయన్నారు.ప్రధానంగా కొరటికల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాత్కాలికంగా పైపులు చేశారే తప్ప నల్లాలు బిగించలేదని విమర్శించారు.ప్రతి ఇంటికి నల్లాకలెక్షన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ప్రధానంగా మండలంలోని అతి పెద్ద గ్రామమైన కొరటికల్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా బ్యాంకు సౌకర్యం లేకపోవడంతో గ్రామంలోని ప్రజలు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.వెంటనే గ్రామంలో బ్యాంక్‌ను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు.గతంలో గ్రామానికి బస్సు సౌకర్యం ఉండగా కరోనా నేపథ్యంలో నిలిపివేసిన బస్సును పునర్ప్రారంభించాలని కోరారు.వాగు నుండి చండూరుకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మురికి కాల్వల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బొడిసే సత్తయ్య, బొడ్డుపెళ్లి యాదగిరి, దొండ వెంకన్న,మహేందర్ పాల్గొన్నారు.
నాంపల్లి:ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు.మండలకేంద్రంలో పార్టీ నాంపల్లి గ్రామ శాఖ 5వ మహాసభ బుధవారం కోరె రాజారత్నం అధ్యక్షతన నిర్వహించారు.మహాసభ ప్రారంభ సూచకంగా పార్టీ పతాకాన్ని మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ఆవిష్కరించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా బండ శ్రీశైలం హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలన్నారు.మండలకేంద్రంలో డ్రయినేజీ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున బస్టాండు నుండి అంగడిబజార్ వరకు వెంటనే సిమెంట్‌రోడ్లు వేయాలన్నారు.ఇండ్లస్థలాలు ఇవ్వాలని, నాగులమ్మ చెరువు అక్రమణ ఆపాలని, పెన్షన్స్, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అత్యాధునిక స్కానింగ్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ కేసీఆర్ ప్రభుత్వం పేదలకు భూములు పంచమంటే లేవని చెప్పి ప్రభుత్వ భూముల అమ్ముకొని డబ్బులు సమకూర్చుకోవడం సిగ్గుచేటన్నారు.నల్లగొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ, ఇతర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ప్రజాసమస్యలపై నికరంగా పోరాడేది ఎర్రజెండా మాత్రమేనన్నారు.ఈ మహాసభలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వాసిపాక ముత్తిలింగం ఆధ్వర్యంలో నూతనకమిటీ ఎన్నుకున్నారు.కార్యదర్శిగా నాంపల్లి రమణ, కమిటీ సభ్యులుగా కె.శ్రీకాంత్, నాంపల్లి వెంకటయ్య, పెరుమాళ్ల రాంబాబు,జి మరియమ్మ,మరో ఇద్దరు సభ్యులను ఎన్నుకున్నారు.