Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ శాఖల మహాసభలను జయప్రదం చేయండి
- సీపీిఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ -రామన్నపేట
గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి పోరాటాలు నిర్వహించాలని, ప్రజా పోరాటాలతోనే సమాజానికి మేలు జరుగుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ అన్నారు. బుధవారం మండలంలోని శోభనాద్రిపురంలో ఆ పార్టీ గ్రామ శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాలమెల్లదీస్తున్నాయని విమర్శించారు. పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రచార ఆర్బాటాలే తప్ప గ్రామాలకు లబ్దిచేకూరేదేమీలేదన్నారు. గ్రామ ప్రగతికి నిధులు కేటాయించకుండా కేవలం రాజకీయ లబ్దికోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆరాటపడుతుందన్నారు. ప్రజల గొంతుకగా నిలిచే సీపీఐ(ఎం) శాఖలను గ్రామీణ స్థాయిలో నిర్మాణం చేసేందుకు నూతన నాయకత్వాన్ని గుర్తించేందుకు గ్రామ శాఖ మహాసభలు ఈ నెల 7 నుండి ఆగస్టు 15 వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేక అశోక్ రెడ్డి, మండల కార్యదర్శి జల్లేల పెంటయ్య, నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం, మండల కమిటీ సభ్యులు కూరెళ్ళ నర్సింహ్మచారి, బావండ్లపల్లి బాలరాజు, గన్నెబోయిన విజయభాస్కర్, వైస్ ఎంపీపీి నాగటి ఉపేందర్, పబ్బతి లింగయ్య, కొమ్ము అంజయ్య, రశీద్, ప్రశాంత్, జంగిలి కుమార్, ఎర్ర సాయిలు, బొడిగె మల్లయ్య, నర్రాంల లింగయ్య ,తదితరులు పాల్గొన్నారు.