Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ - నేరేడుచర్ల
అందని భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా బుధవారం పట్టణంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. మున్సిపాలిటీలో చెత్త సేకరణకు కొనుగోలు చేసిన ట్రాలీ ఆటోలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పల్లెలు, పట్టణాలకు నిధులు కేటాయించేవి కానీ ప్రజలను భాగస్వామ్యం చేయకపోవడంతో అభివద్ధి కాలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెలు, పట్టణాలు అభివద్ధి కోసమే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్మెన్ చంద మల్ల జయ బాబు, వైస్ చైర్మెన్ చల్లా శ్రీలత రెడ్డి, కౌన్సిలర్లు వేమూరి నాగవేణి, అలక సరిత, భాష, పీఏసీఎస్ చైర్మెన్ దొండపాటి అప్పిరెడ్డి, చిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మెన్ అనంతు శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ ఎల్లబోయిన లింగయ్య, బుడిగ చంద్రయ్యగౌడ్, ఇంజమూరి శ్రీనివాస్, రాజేష్, మున్సిపల్ కమిషనర్ గోపయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి సోమయ్య పాల్గొన్నారు