Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొలం పనులను మర్చిపోతున్న రైతులు
- ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలి
- రైతు వేదికల ప్రారంభోత్సవంలో మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మీ గ్రామంలో ఎంత మంది రైతులు వరి పంట సాగు చేస్తున్నారు....ఎంత మంది రైతులు కూరగాయల పంటలు ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు...చేతులెత్తండి అని మంత్రి జగదీశ్‌రెడ్డి రైతులను కోరగా వారంతా వరి పంట సాగు చేస్తున్నామని చేతులెత్తారు.దీంతో మంత్రి అందరూ వరి పంటను సాగు చేస్తున్నారా...? సోమరి పోతుల వ్యవసాయం వద్దని రైతులకు చురకలు అంటించారు.బుధవారం మండలంలోని యాద్గార్పల్లి, ఊట్లపల్లి గ్రామంలో రైతు వేదికలను ప్రారంభించి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి రైతు సభలో మాట్లాడారు.రైతులందరూ ఒకే పంటపై అలవాటుపడి పంట దిగుబడి అవసరమైన మెళకువలు మరిచిపోతున్నారని, వ్యవసాయ పనులు మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నాగలి పట్టడం, దుక్కిదున్నడం, రైతులు మరిచి ఎన్నో రోజులైందని, దిక్కు లేనప్పుడే వరి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు.భూమి నుంచి బంగారం పండించాలని కొనేది రైతులు కొత్త పద్ధతులు అవలంబిస్తారని చెప్పారు.ఆకుకూరలు, ఆరుతడి పంటలు సాగు చేసుకుంటే మంచి లాభాలు పొందవచ్చని చెప్పారు. ముఖ్యంగా మనకు అవసరమైన ఆహార పదార్థాల వంటలను మనమే సాగు చేసుకుంటే వాటి ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్పుకొచ్చారు.పెన్‌పహాడ్, ఇతర మండలాల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి లాభాలు పొందుతున్నవిషయం తమకు చెప్పారని గుర్తు చేశారు. ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగాల కోసం నిర్వహించకుండా పంటలపై దష్టి పెట్టి లాభాలు పొందుతున్న ఎంతో మంది రైతులు ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకొని ప్రత్యామ్నాయ పంటల సాగు పొందాలన్నారు. దేశం మొత్తం వరి సాగు ఎక్కువగా చేస్తున్నారని, దీనివల్ల వరి పంటకు ధర రావడం లేదని తెలిపారు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారని, ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. రైతులు లక్షాధికారి కావాలనే సంకల్పంతో కేసీఆర్ గ్రామాల్లో రైతు వేదిక ఏర్పాటు చేశారని, లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు రైతు భవనాలు వేదికలుగా మారాలన్నారు. ఈ వేదికలు రైతు జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ రాహుల్‌శర్మ, జేడీఏ శ్రీధర్‌రెడ్డి, మార్కెట్ చైర్మెన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంతరెడ్డి, జెడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, సర్పంచులు శ్రీనివాస్, ఆర్డీవో రోహిత్‌సింగ్, ఏడీఏ నాగమణి, ఏవో శ్రీనివాస్, పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవి, ఎంపీడీవో అజ్మీరా దేవిక, ఎంపీఓ వీరారెడ్డి పాల్గొన్నారు.