Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ - నార్కట్‌పల్లి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి అన్నారు.బుధవారం మండలపరిధిలోని ఏపీలింగోటం గ్రామంలో నిర్వహించిన ఆ పార్టీ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు.పేద బడుగు బలహీన వర్గాల అభివద్ధి కోసం ఎర్ర జెండా ఎనలేని కషి చేస్తుందని పేర్కొన్నారు నార్కట్ పల్లి మండల కేంద్రం చుట్టూ పరిశ్రమలు ఏర్పాటు అయినప్పటికీ ఆ పరిశ్రమలో స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు.బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం బాధాకరమన్నారు.ఈ ప్రాంతానికి చెందిన భూములను బ్యాంకు సబ్సిడీలను పొంది ఇక్కడ యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం దురదష్టకర మన్నారు.2021లో గ్రామ శాఖ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, కేంద్ర స్థాయి మహాసభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. స్థానికంగా ఉన్న యువతీ యువకులు సమస్యలు మహిళా సమస్యలు, అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించాలని ధ్యేయంతోనే పార్టీ ప్రజా పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. గ్రామస్థాయిలో శాఖ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించడం మూడేండ్లు ఏర్పాటయిన శాఖలకు పునర్నిర్మాణం చేసేందుకు పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా నూతన శాఖలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శాఖ సమావేశం జరిగిన దానిపై రివ్యూ నిర్వహించి, ప్రజాసమస్యల పరిష్కార దిశగా ఉద్యమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.కరోనా కట్టడిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.కానీ తమ పార్టీ కార్యాలయాలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చి సేవలందిస్తున్నామన్నారు.ఈ నెల 7 నుండి ఆగస్టు 15 వరకు నూతన కార్యవర్గ ఎన్నికలను, మహాసభలు నిర్వహిస్తామన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.నూతన శాఖ కార్యదర్శిగా ఎస్కె నన్నె సాహెబ్, సహాయ కార్యదర్శిగా భిక్షంలను ఎను కున్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి చెరుకు పెద్దులు, వైస్‌ఎంపీపీ కల్లూరి యాదగిరిగౌడ్, ఎస్కె. నన్నెసాహెబ్, ఓరుగంటి సత్తయ్య, యాదమ్మ పాల్గొన్నారు.