Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయపడి దుకాణాలు తెరవని రేషన్ డీలర్లు
- నేటికీ షాపులకు బియ్యం సరఫరా చేయని కాంట్రాక్టర్
- కాంట్రాక్టర్, గోదాం ఇన్చార్జి నిర్లక్ష్యంపై ఆగ్రహం
నవతెలంగాణ-మోత్కూరు
మండలంలో రేషన్ దుకాణాలపై బుధవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ టీం తహసీల్దార్ కమల్ భాషా ఆధ్వర్యంలో రెండు బందాలు ఉదయం 9 గంటల నుంచి రేషన్ షాపులను తనిఖీ చేశారు. మున్సిపల్ కేంద్రంతో పాటు గ్రామాల్లోని రేషన్ దుకాణాలను ఉదయం 9.30 గంటలకు తెరిచి ఉంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలకు భయపడి మున్సిపల్ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో డీలర్లు దుకాణాలను తెరువలేదు. బందం అధికారులు డీలర్లకు ఫోన్లు చేసినా స్పందించలేదు. మోత్కూరు, జామచెట్లబావి, కొండగడప, పాటిమట్ల గ్రామాల్లోని 8 రేషన్ దుకాణాలు తనిఖీ చేయగా జామచెట్ల బావి గ్రామంలోని దుకాణంలో 4 క్వింటాళ్ల బియ్యం లెక్క తేలకపోవడంతో దుకాణాన్ని సీజ్ చేసి కొండగడప డీలర్‌కు ఇన్చార్జి అప్పగించారు. అనంతరం మోత్కూరులోని బియ్యం గోదాం (ఎంఎల్‌ఎస్‌పాయింట్)ను తనిఖీ చేసి స్టాక్‌ను, రికార్డులను పరిశీలించారు. ఆర్వోలు, ట్రక్ షీట్ల పై తేదీలు వేయకపోవడం, గోదాం ఇన్చార్జి, కాంట్రాక్టర్ సంతకాలు చేయకపోవడం పై గోదాం ఇన్చార్జి జుబేర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కమలభాషా విలేకరులతో మాట్లాడుతూ మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, ఆత్మకూరు(ఎం) మండలాల రేషన్ దుకాణాలకు మోత్కూరు గోదాం నుంచి బియ్యం సరఫరా అవుతాయని, గోదాం, రేషన్ దుకాణాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, సమయ పాలన పాటించడం లేదని తెలిపారు. దుకాణాలకు బోర్డులు పెట్టలేదని, ధరల పట్టికలు ఏర్పాటు చేయలేదని తెలిపారు. గోదాం నుంచి ప్రతి నెలా 25 నుంచి 30లోగా రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేయాల్సి ఉందని, కానీ చాలా దుకాణాలకు నేటికీ బియ్యం పంపలేదన్నారు. గోదాం ఇన్‌చార్జ్జి, స్టేజ్-2 కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో సక్రమంగా సరఫరా కావడం లేదని తమ దష్టికి వచ్చిందన్నారు. సివిల్ సప్లరు డిప్యూటీ తహసీల్దార్ తనూజ ఏడాది కాలంగా గోదాంను గాని, దుకాణాలను పర్యవేక్షించడం లేదని తమ దష్టికి వచ్చిందని తెలిపారు. ఖాళీ బస్తాలకు ప్రభుత్వం ఒక్కో బస్తాకు రూ.20 చెల్లిస్తున్నా డీలర్లు తిరిగి గోదాంలకు అప్పగించకుండా బయట అమ్ముకుంటున్నారని, తిరిగి అప్పగించని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్ఐలు బ్రహ్మచారి,పరంజ్యోతి, సివిల్ సప్లరు ఆర్ఐ విజయసింహారెడ్డి పాల్గొన్నారు.