Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
నవతెలంగాణ/మోత్కూరు:
మోత్కూరు మున్సిపాలిటీ అభివద్ధికి అన్ని విధాల కషి చేస్తున్నానని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు జామచెట్లబావి గ్రామంలో రూ.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, మున్సిపల్ పాలకవర్గం సమన్వయంతో పని చేసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, వైస్ చైర్మెన్ బి.వెంకటయ్య, కౌన్సిలర్లు దబ్బెటి విజయరమేష్, బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, పురుగుల వెంకన్న, వనం స్వామి, కూరెళ్ల కుమారస్వామి,జెడ్పీటీసీ గోరుపల్లి శారదసంతోష్ రెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ కంచర్ల అశోక్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పొన్నెబోయిన రమేష్, గజ్జి మల్లేష్, రైతుబంధు మండల కోఆర్డినేటర్ కొండా సోంమల్లు, మార్కెట్ మాజీ చైర్మెన్ టి.మేఘారెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్లు షాహిన్ సుల్తానా, పి.ఆనందమ్మ, కమిషనర్ షేక్ మహమూద్, మేనేజర్ ప్రభాకర్, తహసీల్దార్ షేక్ అహ్మద్ పాల్గొన్నారు.