Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బుధవారం ఎంఆర్పీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం కార్యకర్తలు ఎంఆర్పీఎస్ జెండావిష్కరించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మంద కష్ణమాదిగ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోయ దేవేందర్, సుక్క సుదర్శన్, ఊదరి శ్రీను, వెంకటేశ్, చింతల సాయిలు, బర్రె శంకర్, సుధాకర్, అల్మాసిపేట కిష్టయ్య, ఎర్ర శంకర్, వెల్వర్తి జంగయ్య, గాలయ్య, చంద్రశేఖర్, బాబు, రాజు పాల్గొన్నారు.
మోటకొండూర్ : ఎమ్మార్పీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఆ సంఘం మండల అధ్యక్షులు వెల్మజాల యాదయ్య జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బైరపాక నగరాజు మాదిగ, సీనియర్ నాయకులు బొట్ల మంగపతి, కొల్లూరి యాదగిరి, కొల్లూరి మైసయ్య, వంగపల్లి మహేందర్, మండల ఉపాధ్యక్షులు ఆడెపు ప్రశాంత్, యువసేన మండల అధ్యక్షుడు ముడుగుల శ్రీకాంత్, ఎఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు బొట్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం : మండలంలోని మర్యాల గ్రామంలోఎమ్మార్పీఎస్ జెండాను గ్రామ శాఖ ఆధ్వర్యంలోఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు శ్రీపతి ఎల్లేష్ , నాయకులు ఎర్రోళ్ల జహంగీర్ మండల నాయకులు సంగి మహేష్, సంగి చక్రి , శ్రీధర్, ఎర్రోళ్ల రమేష్, నవీన్, వేణు, కుమార్, సందగళ్ళ కార్తిక్, శీలం నాగరాజు, నల్లగొండ వినరు,ఐలేష్, సాయి పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : పిల్లాయిపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, మందకష్ణ మాదిగ పుట్టినరోజు పురస్కరించుకొని ఆ సంఘం మండల ఇన్చార్జి కొమ్మనబాల నరసింహ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అందెల హరీష్ యాదవ్, కొంతం ఈశ్వర్‌గౌడ్, ముద్దగోని నరసింహ గౌడ్, గ్రామ శాఖ కార్యదర్శి కొడిసెల మల్లేష్ , సుక్క లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.