Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్
నవతెలంగాణ - తిరుమలగిరి
పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పల్లెలు సుందరంగా తీర్చిదిద్ద బడుతున్నాయని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. 4వ విడత పల్లె ప్రగతిలో భాగంగా గురువారం మండలంలోని జలాల్పురం గ్రామంలో ఆయన పర్యటించారు. స్మశాన వాటికను ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. ప్రజలు భాగస్వాములైతే గ్రామాలను ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకన్న, ఎంపీపీ నెమరుగొమ్ముల స్నేహలత, జెడ్పీటీసీ దూపటి అంజలి, మార్కెట్ కమిటీ చైర్మెన్ అశోక్‌రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ తిరుపతయ్య, తహసీల్దార్ సంతోష్‌కిరణ్, ఎంపీడీవో ఉమేష్, గ్రామ స్పెషల్ ఆఫీసర్లు, ప్రజలు పాల్గొన్నారు.
అర్వపల్లి :పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారానే గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ఏర్పడుతుందని ఎమ్మెల్యే గాదరి కిశోర్య కుమార్ అన్నారు. హరితహారం, పల్లె ప్రగతిలో భాగంగా గురువారం ఆయన మండల పరిధిలోని కొమ్మాల, కోడూరు గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు. నూతనంగా నిర్మించిన స్మశానవాటికలను ప్రారంభించారు. అనంతరం కొడూరు గ్రామంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ హరితహారం ద్వారా గ్రామాల్లో పచ్చదనం ఏర్పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. అనంతరం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు.
మృతుని కుటుంబానికి పరామర్శ
మండల పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన పిట్టల శ్రీరాములు ఇటీవలే కరోనాతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. రూ.20 వేల ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక, జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మెన్ కుంట్ల సురేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి నాయకులు గుండగాని సోమేష్, మరిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, మన్నె లక్ష్మీ నర్సయ్య యాదవ్, పీడీ కిరణ్‌కుమార్, మండల ప్రత్యేక అధికారి సురేష్, ఎంపీడీవో ఉమేష్, ఎంపీవో సురేష్, ఏవో శరత్ చంద్ర, మహేంద్ర కుమార్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, గ్రామ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నాగారం:దళితుల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ దళిత ఎంపవర్మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. నాగారం మండల పరిధిలోని పస్తాల, పసునూరు గ్రామాల్లో ఆయన గురువారం పర్యటించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి ద్వారా పల్లెలు హరితవనంలా మారాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఇలాంటి పథకాలు ప్రవేశ పెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మెన్ అశోక్‌రెడ్డి, ఎంపీపీ కూరం మని వెంకన్న, వైస్ ఎంపీపీ మణిమాల, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఉప్పలయ్య, పొదిల రమేష్, పానుగంటి నరసింహారెడ్డి, డీఆర్డీఏ పీడీ కిరణ్, డీపీవో యాదయ్య, డీఎల్పీవో లక్ష్మీనారాయణ, తహసీల్దార్ కమలాద్రి, ఎంపీడీవో శోభారాణి, మల్యాల ఈశ్వరమ్మ, సాలయ్య, నర్సింహారెడ్డి, కర్ణాకర్, ఎంపీటీసీలు నరేష్, మంజుల, నాయకులు అశోక్, వెంకన్న, అంజయ్య, కృష్ణ, విజరు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.