Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారంలోకి రావడం భ్రమ
- దొంగే దొంగ అన్నట్టు ఏపీ సీఎం జగన్ వ్యవహరం
- మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేట
రేవంత్‌రెడ్డి ఓ పగటి వేషగాడు..అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నాడు.. అని మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యావత్ తెలంగాణ సమాజం సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు ఏనాడూ ప్రజల గురించి పట్టించుకోలేదని, పక్కా రాష్ట్రం ఆంధ్రకు లాభం చేసేలా వ్యవహరించేలా చేశాయన్నారు. వాటిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. నీటి విషయంపై ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాయడం దొంగే దొంగ అన్నట్టు ఉందన్నారు. జీవో 203ను వెనక్కి తీసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రోడ్లు, డ్రయినేజీల సమస్యలు పరిష్కరించాలి
పట్టణంలో రోడ్లు, డ్రయినేజీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా గురువారం పట్టణంలోని 42వ వార్డులో ఆయన పర్యటించారు. వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్, పార్కును మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీనాగార్జునతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్యల పరిష్కారమే పట్టణ ప్రగతి లక్ష్యమన్నారు. వార్డుల్లో ఎక్కడా మురుగునీరు ఆగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ పుట్టా కిశోర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు అంగిరేకుల నాగార్జున, ఉప్పల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.