Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తుంగతుర్తి
గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టినట్టు ఎంపీపీ గుండగాని కవిత రాములుగౌడ్ అన్నారు. పల్లె ప్రగతి, హరితహారంలో భాగంగా గురువారం మండలంలోని బాపన్బాయి తండా, రావులపల్లి ఎక్స్రోడ్తండా, దేవునిగుట్టతండా, రామన్నగూడెం తండా గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించి మాట్లాడారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో పారిశుధ్యం, మౌలిక సదుపాయాల కల్పన, హరితహారం, విద్యుత్ సమస్యలన్నీ పరిష్కారం కావాలన్నారు. గ్రామాల అభివృద్ధికి పార్టీలకతీతంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మి, ఎంపీవో భీమ్‌సింగ్ నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు భూక్య బద్రి వీరన్న, గుగులోతు వెంకన్న, గుగులోతు ఈరోజి, గుగులోతు కాంతమ్మరాములు, ఉప సర్పంచ్ కళావతి, పంచాయతీ కార్యదర్శులు జ్యోతి, సబ్జర్ అలీ, జగదీష్, వెంకటేష్, గ్రామ ప్రత్యేక అధికారులు ప్రమీల, దశరథ, అశోక్, లక్ష్మీ, ఎంపీటీసీ లకావత్ మంగతి, అంగన్వాడీ టీచర్ చంద్రకళ, ఇండ్ల వెంకన్న, ఆశాలు పద్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.