Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిరుపేద ప్రజలకు చేసిన సేవలు ప్రశంసనీయమని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నీలం వెంకటస్వామి, మండల అధ్యక్షులు కన్రాజు వెంకటేశ్వరరాజు అన్నారు. గురువారం స్థానిక ఇందిరా కాంగ్రెస్ భవనం కార్యాలయం ఆవరణలో దివంగత రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీఏసీిఎస్ డైరెక్టర్ కట్టే గుమ్ముల సాగర్ రెడ్డి, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిగొండ శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ ఎండి.జైన్ద్దీన్, నాయకులు చింతలపాని శ్రీనివాస్ రెడ్డి , పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి బాబా, పర్రె రమేష్, జాంగిర్, మాను పాటి వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : మున్సిపల్ కేంద్రంలోని రాజీవ్ స్మారక భవనంలో గురువారం కాంగ్రెస్ మండలకమిటీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు బక్క శ్రీనాథ్, మున్సిపల్ అధ్యక్షులు మొగుదాల రమేశ్‌గౌడ్, ఫ్లోర్ లీడర్ కొయ్యడ సైదులుగౌడ్, సర్పంచ్‌లు వెల్వర్తి యాదగిరి, గుడ్డేటి యాదయ్య, జిల్లా కార్యదర్శి సుర్వి నర్సింహాగౌడ్, నాయకులు దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
బొమ్మలరామారం : వైఎస్సార్ జయంతి సందర్భంగా మండలరూంకనదంలె వైఎస్సార్సీపీ మండల నాయకులు సుర్వి వెంకటేష్ గౌడ్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వాస్పత్రిలో బ్రెడ్లు పండ్లను పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులుఇండ్ల అంజయ్య,భక్తతుల లక్ష్మయ్య ,ఇండ్ల నరసింహా, వినరు , నరేష్ గౌడ్, సుదర్శన్ గౌడ్ భిక్షపతి కోటేశ్ శ్రీరాములు బల్రామ్ సుధాకర్ పాండు రాజు పాల్గొన్నారు.