Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్
నవతెలంగాణ-నల్లగొండ/ భువనగిరిరూరల్
నూతన పురపాలక చట్టం ననుసరించి పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో లే అవుట్ అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర పురపాలన, పట్టణ అభివద్ధి ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ జిల్లా కలెక్టర్లను,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుండి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు,మున్సిపల్ కమిషనర్లు,పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. లేఅవుట్ల అనుమతులు, భవన నిర్మాణ అనుమతులు,పట్టణ ప్రగతి, హరిత హారం తదితర అంశాలపై సూచనలు చేశారు. నూతన మున్సిపల్ చట్టం నిబంధనలు ప్రకారం టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్లైన్లో వచ్చిన లేఅవుట్లు,పట్టణ ప్రణాళిక విభాగం టెక్నికల్ పరిశీలన తర్వాత జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ అనుముతులు జారీ చేయాలన్నారు.లేఅవుట్ ఖాళీ స్థలం మున్సిపాలిటీ, జీపీలు తమ పేరున రిజిస్ట్రర్ చేసి ఆ స్థలంలో మొక్కలు నాటి పరిరక్షించాలన్నారు.10 ఎకరాల వరకు టెక్నికల్ స్క్రీనింగ్ తర్వాత జిల్లా స్థాయి కమిటీ,10 ఏకరాలు దాటితే డీటీసీపీి ద్వారా లే అవుట్ అనుమతులు నిర్ణీత సమయంలో మంజూరు చేయాలన్నారు.పట్టణ ప్రణాళిక అధికారులు,సిబ్బంది లే అవుట్ లు అనుమతులు,భవన నిర్మాణ అనుమతుల్లో నిర్లక్ష్యం వహించినా,అక్రమాలకు పాల్పడినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.లే అవుట్ లు,భవన నిర్మాణం ల పై క్షేత్ర స్థాయిలో పరిశీలన, తనిఖీ లు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లను ఆదేశించారు.అనుమతులు లేని లే అవుట్ లు రిజిస్ట్రేషన్ చేయకుండా సర్వే నంబర్ లతో సబ్ రిజిస్ట్రార్ లకు లేఖ రాయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, తదితరులు పాల్గొన్నారు.