Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మున్సిపాలిటీలో సమగ్రాభివద్ధికి మున్సిపల్ కమిషనర్లు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. గురువారం కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి మున్సిపల్ కమిషనర్లతో సమావేశమై మున్సిపాలిటీ వారీగా అభివద్ధి పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15లోగా వైకుంఠ గ్రామాలు,వెజ్, నాన్ వేజ్ సమీకత మార్కెట్లు , డంపింగ్ యార్డులు పెండింగ్ పనులను ప్రారంభించాలని ఆదేశించారు. అన్ని మున్సిపాలిటీలలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ లు, వైకుంఠ దామం దామాల పనులకు టెండర్లు ప్రక్రియ పూర్తయిన ఇంకా పనులు ప్రారంభించక పోవడంపై కలెక్టర్ అసంతప్తి వ్యక్తం చేశారు. పట్టణంలోని హైవే ప్రాంతాల, పట్టణంలోని లేఅవుట్స్, తహల్దార్ లతో కలిసి పరిశీలించాలని, అక్రమలేఅవుట్స్, అక్రమ కట్టడాలు ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు లేఅవుట్ సంబంధించి పది శాతం వారికి రిజిస్టర్ చేయాలని, 30 శాతం స్థలం రోడ్లు ఇతర యుటిలిటీ కోసం లే అవుట్ కేటాయింపులు ఉండాలని కలెక్టర్ సూచించారు. మానవ వ్యర్ధాల శుద్ధి ప్లాంటు ఏర్పాటు కోసం వెంటనే స్థల సేకరణ పూర్తి చేసి, టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. పన్నులు వసూలు నూరు శాతం పూర్తి చేసుకుని మున్సిపాలిటీలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. మిషన్ భగీరథ తాగునీరు అందుతుంనందున విద్యుత్ బిల్లు తగ్గించుకునేలా బోరు నీటి సరఫరా నియంత్రించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.