Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-బీబీనగర్
బీబీనగర్ ఎయిమ్స్ పై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం ఎంపీ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించి, డైరెక్టర్ వికాస్ భాటియాతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎయిమ్స్ లకు వందల కోట్ల నిధులు మంజూరు చేస్తుందన్నారు. కానీ బీబీనగర్ ఎయిమ్స్ కు ఇప్పటి వరకు 28 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేసి వివక్ష చూపిందన్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీసి ఎయిమ్స్ కు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎయిమ్స్ ప్రాంగణంలో డైరెక్టర్ వికాస్ భాటియాతో కలిసి మొక్కలు నాటారు.
వైఎస్ఆర్కు నివాళులు
ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షులు పొట్టోళ్ల శ్యామ్‌గౌడ్, నాయకులు పంజాల రామాంజనేయులుగౌడ్, ప్రమోద్‌కుమార్, బర్రె జహంగీర్, బద్దం వాసుదేవరెడ్డి, గూడూరు నిఖిల్‌రెడ్డి, బెండ ప్రవీణ్, పంజాల పెంటయ్య, గోపినాయక్, మధుగౌడ్, సామల వేణు, చంద్రయ్య పాల్గొన్నారు.