Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నిడమనూరు
ప్రజలెదుర్కుంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన పార్టీ మండల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దేశ సంపదను లూటీ చేస్తోందని విమర్శించారు. ఇందులో భాగంగానే రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిందని చెప్పారు. నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ, ఇతర పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, ఉపాధిహామీ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, అర్హులైన వారందరికీ ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి కొండేటి శ్రీను, దైద శ్రీను, కత్తి లింగారెడ్డి, కోమాండ్ల గుర్వయ్య, నల్లబోతు సోమయ్య, కొప్పు వెంకన్న, రాజమ్మ, యశోద, కోదండ చరణ్రాజు, వింజమూరి శివ, ముత్యాల కేశవులు, ఆకారపు నరేష్ మేరుగు రాములు పాల్గొన్నారు.