Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగిరెడ్డి
నవతెలంగాణ-హాలియా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కూన్‌రెడ్డి నాగిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సుందరయ్య భవన్లో అనుముల, తిరుమలగిరి, పెద్దవూర మండలాల పార్టీ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనాతో ఉపాధి కోల్పోయి ప్రజలు వీధిన పడుతుంటే ఆదుకోవాల్సిన ప్రధాని మోడీ ప్రజలపై మరిన్ని భారాలు మోపుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం విపరీతంగా ఉందన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు అమలు కావడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నేటి వరకూ కొత్త రేషన్‌కార్డులు, కొత్త పెన్షన్లు అందక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అవుతా సైదులు, అనుముల, తిరుమలగిరి, పెద్దవూర మండలాల కార్యదర్శులు కత్తి శ్రీనివాసరెడ్డి, కుర్ర శంకర్ నాయక్, దుబ్బా రామచంద్రయ్య, నాయకులు వేములకొండ పుల్లయ్య, నామ సత్యనారాయణ, చిరునాగార్జున, దోరేపల్లి మల్లయ్య, పొదిలి వెంకన్న, దుబ్బ పరమేష్, కారంపూడి ధనమ్మ, జటావత్ రవినాయక్, లచ్చిరెడ్డి పాల్గొన్నారు.