Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మునుగోడు
మండలకేంద్రంలో తపాలా కార్యాలయం గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు తాళం వేసి ఉండటంతో ఆసరా పింఛన్ కోసం వచ్చిన లబ్దిదారులు ఇబ్బందులకు గురయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, మునుగోడు సర్పంచ్ వెంకన్న , బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు గుంటోజు వెంకటాచారి తపాలా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసరా పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గంటల తరబడి కార్యాలయం వద్ద పడిగాపులు కాసిన ప్పటికీ తపాలా కార్యాలయం నిర్వాహకులు సిగల్ సాకుతో లబ్దిదారులను ఇబ్బందికి గురిచేస్తున్నారన్నారు. సాయంత్రం వరకు పడిగాపులు గాయడంతో లబ్దిదారులు అస్వస్థతకు గురవుతున్నారన్నారు. క్రమ సంఖ్య పద్ధతిన పింఛను లబ్దిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటన మళ్లీ పునరావతం అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.