Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి
యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడేందుకు అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులపై పోలీసులు నిఘాతో డేగ కన్ను వేశారు. ఇటీవల అసాంఘిక స్థావరాలపై దాడులు చేసి కేసులు నమోదు చేయడమే కాకుండా భువనగిరి ఆర్డీవో అనుమతితో ఆ భవనాలను సీజ్ కూడా చేశారు.
- చక్ర లాడ్జి సీజ్....
యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ చక్రలాడ్జిలో అసాంఘిక కార్యకలాపాల ఆరోపణల మేరకు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో లాడ్జిపై రైడ్ చేసి గత నెలలో కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన శ్రీ చక్ర ఫ్యామిలి లాడ్జ్‌ను సీజ్ చేయడానికి భువనగిరి ఆర్డీవో భూపాల్‌రెడ్డికి తెలియజేసినట్టు టౌన్ ఇన్స్పెక్టర్ జానారెడ్డి తెలిపారు. ఆర్డీవో ఆదేశాల మేరకు గురువారం యాదగిరిగుట్ట ఎస్ఐ రాంపాక యాదయ్య, తహసీల్దార్ ఆఫీస్ ఆర్ఐ శ్రీకాంత్‌ల సమక్షంలో శ్రీ చక్ర ఫ్యామిలి లాడ్జిని సీజు చేసినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.
వ్యభిచార గహం కూడా....
మండలంలోని పెద్దకందుకూర్‌లో ఓ నివాస గహంలో వ్యభిచారం నిర్వహిస్తున్న వారి పై కేసు నమోదు చేసి ఆ గహాన్ని కూడా సీజ్ చేసినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం : ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి
పవిత్ర పుణ్యక్షేత్ర ప్రదేశంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదు. టెంపుల్ పవిత్రతను అపవిత్రం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే వారిపై ఉక్కుపాదం మోపుతాం. చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదలబోం.