Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
మండలంలోని దాచారం గ్రామంలో కొన్నేండ్లుగా వివాదాస్పదంగా ఉన్న సర్వే నెంబర్లు 278, 351లోని భూమిని శుక్రవారం రెవెన్యూ అధికారులు రీసర్వే ప్రారంభించారు. ఆ భూమిలో కబ్జాలో ఉన్న రైతులకు పాసు పుస్తకాలు, హద్దులు సక్రమంగా లేకపోవడం, పాసు పుస్తకాలు ఉన్న విధంగా కబ్జాలో లేకపోవడంతో రైతులు తమకు పట్టా పాసు పుస్తకాలు ఇప్పించాలని, హద్దులు నిర్ణయించాలని ఇటీవల పల్లె ప్రగతిలో పాల్గొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్కు విన్నవించారు. స్పందించిన ఆయన భువనగిరి ఆర్డీవో ఎంవి.భూపాల్ రెడ్డి పర్యవేక్షణలో సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సర్వే ఆఫ్ లాండ్ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే చేపట్టారు. సర్వేలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ మజీద్, తహసీల్దార్ షేక్ అహ్మద్, ఆ గాలయ్య, సర్వేయర్లు శ్రీనివాసరావు, వెంకటేష్, మహేందర్ రెడ్డి, వీఆర్వోలు అంజయ్య, ఇస్తారి, రవీందర్, వీఆర్ఎలు శ్రీను, సైదులు, శ్రీనివాస్, పరశురాములు పాల్గొన్నారు.