Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు
నవతెలంగాణ -మోటకొండూర్
గంధమల్ల రిజర్వాయర్ ద్వారా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగు నీరు అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని ఆరెగూడెంలోని మల్లయ్య ప్రాంగణంలో బోల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఆ పార్టీ మండల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంధమల్ల రిజర్వాయర్ ద్వారా వచ్చే సాగు ,తాగునీటి కోసం సీపీఐ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు పాదయాత్ర, రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టినా నేటికీ ఆలేరు నియోజకవర్గంలో సాగు, తాగు నీరుకు నోచుకోలేదని విమర్శించారు. వంగపల్లి నుండి మోటకొండూర్కు వచ్చే మార్గంలో బైపాస్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని గతంలో అండర్ పాస్ బ్రిడ్జి కోసం జాతీయ రహదారిపై ఆందోళన చేసిన వారిపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి గాదేగాని మాణిక్యం, జిల్లా నాయకులు రేగు సిద్దయ్య, మండల సహాయ కార్యదర్శి అలెటి బాలరాజు, ముసుకు పెంటరెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు పసుల నరసింహ, సొప్పరి భాగ్యమ్మ, ఎర్ర నాగయ్య, సుధాగాని వెంకన్న, అరేగుడెం గ్రామ శాఖ కార్యదర్శి పిట్టల కరుణాకర్,నల్ల ప్రదీప్ రెడ్డి, పెరబోయిన శంకర్, మారబోయిన భాస్కర్, మారబోయిన అనిల్, గాధగాని కరుణాకర్ పాల్గొన్నారు.