Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ - సూర్యాపేట కలెక్టరేట్
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో సాగర్ ఎడమ కాలువ ఆయకట్టును ఎడారిగా మారుస్తున్న ఆంధ్ర జల దోపిడీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల వివాదాన్ని తెర మీదకు తెచ్చి రెండు రాష్ట్రాలకు చెందిన రైతులను గందరగోళానికి గురి చేయడం సరికాదన్నారు. ఒకపక్క స్నేహపూర్వకంగా నటిస్తూ సాగర్, పులిచింతల ప్రాజెక్టులో నిలువ నీరు లేకుండా విద్యుత్ ఉత్పాదన పేరుతో సముద్రం పాలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తిని ఆపి ఎడమ కాలువకు నీటినీ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఏవో శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు ఉస్తెల సృజన, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్, ఉస్తెల నారాయణరెడ్డి, దొడ్డ వెంకటయ్య, పాలకూరి బాబు, ధనంజయ నాయుడు, మండవ వెంకటేశ్వర్లు, బాదె నర్సయ్య, పోకల వెంకటేశ్వర్లు, కొండ కోటయ్య, షేక్ లతు, దంతాల రాంబాబు, రెమిడాల రాజు, ఉప్పుతోట కోటమ్మ, ఖమ్మంపాటి రాము, బూర వెంకటేశ్వర్లు, తోట్ల ప్రభాకర్, లింగయ్య, గాలి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.