Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివద్ధి చెందుతాయని మండల ప్రత్యేకాధికారి బి.యాదయ్య, ఎంపీడీవో పోరెడ్డీ మనోహర్ రెడ్డి అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని పాటిమట్ల, సదర్శాపురం,దాచారం, అనాజిపురం, పొడిచేడు, దత్తప్పగూడెం, పాలడుగు, ముశిపట్ల, పనకబండ, రాగిబావి గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను వారు పరిశీలించారు. పాత ఇండ్లు కూల్చివేయడం, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకతి వనాలు తదితర పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎంపీవో ఎం.సురేందర్ రెడ్డి, సర్పంచులు దండెబోయిన మల్లేష్, వర్రె కవిత, అండెం రజిత, ఉప్పల లక్ష్మీ, పేలపూడి మధు, ఎలుగు శోభ, మరిపెల్లి యాదయ్య, రాంపాక నాగయ్య, పైళ్ల విజయ, తిరుమలేష్ గ్రామ ప్రత్యేకాధికారులు వెంకటేశ్వర్లు, టి.గోపీనాథ్, ఎం.అశోక్, జె.సైదులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం మున్సిపాలిటీలోని మోత్కూరు నుంచి బుజిలాపురం వరకు బీటీ రోడ్డుకిరువైపులా హరితహారంలో మొక్కలు నాటారు. పట్టణంలో దోమల నివారణకు ఫాగింగ్ చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మెన్ బి.వెంకటయ్య, కౌన్సిలర్ బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిరూరల్ : మండలంలోని వాడపర్తి గ్రామంలో శుక్రవారం నాలుగో పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎలిమినేటి కష్ణారెడ్డి మాట్లాడుతూ పది రోజుల నుండి గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత విజయవంతంగా చేపట్టినట్టు తెలిపారు. హరితహారం మొక్కలు నాటామన్నారు. నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొబ్బిలి మన్నెమ్మ యాదవ్ , వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
అనంతారంలో ప్లాస్టిక్ ఏరివేత
మండలంలో అనంతారం గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా శుక్రవారం ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిందం మల్లిఖార్జున్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్లాస్టిక్‌ను ఏరివేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
భువనగిరి : పట్టణకేంద్రంలో శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు వార్డుల్లో మున్సిపల్ చైర్మెన్ ఎనబోయిన ఆంజనేయులు పర్యటించారు. ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఇంటిలో ఇంటి బయట మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ చింతల కిష్టయ్య, కమిషనర్ పూర్ణచందర్, కౌన్సిలర్ పంగ రెక్కల స్వామి, బానోత్ వెంకట్ నాయక్, మహిళా రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.