Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ : పెరుగుతున్న గ్యాస్, పెట్రోలు, నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని కోరుతూ ఈ నెల 5న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద నిరసన తెలిపిన మహిళా సమాఖ్య సభ్యులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జంగమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో శుక్రవారం సీపీఐ కార్యాలయంలో మండల కార్యదర్శి మాటూరి జానమ్మ అధ్యక్షతన నిర్వహించిన ఆ సమాఖ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం అక్రమ కేసులు ఉపసంహరించుకునేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సరళ, కల్యాణి ,జాంగీరిబీ,చంద్రకళ, రామ, కతీజ పాల్గొన్నారు.
పల్లెప్రకృతివనం, స్మశాన వాటికకు స్థలం కేటాయింపు
వలిగొండ : మండల పరిధిలోని లింగరాజుపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 624 ప్రభుత్వ భూమి మూడెకరాలు పల్లె ప్రకతి వనం, శ్మశాన వాటికు కేటాయించినట్టు ఆ గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి ఉమాకృష్ణ తెలిపారు. శుక్రవారం తహసీల్దార్ నాగలక్ష్మి సమక్షంలో సర్వేయర్ శంకర్ సహాయంతో హద్దులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నేడు ఎమ్మెల్యే రాక
బీబీనగర్ : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా నేడు పట్టణానికి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రానున్నట్టు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నారగోని మహేశ్‌గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలకేంద్రంలోని పడమటిసోమారం గ్రామానికి వెళ్లే రోడ్డు నుండి వైబ్రా పరిశ్రమ వరకు మొక్కలు నాటనున్నట్టు పేర్కొన్నారు.