Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-హాలియా
దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంకిత భావంతో పనిచేస్తున్నారని, వారికష్టాలను మొదట గుర్తించింది కేసీఆరేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మొట్టమొదటి సారిగా శాసనసభ్యులుగా ఎన్నికయిన రోజునే ఆయన దళితుల అభివద్ధికి అంకురార్పణ చుట్టారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితక్రాంతి పధకానికి కతజ్ఞతగా శుక్రవారం సాయంత్రం నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదసభ నిర్వహించారు. సర్పంచులు పాల్గొన్నారు.అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ మొట్టమొదటి సారిగా శాసనసభ్యులుగా అయిన మొదట్లోనే తన సేవలు ఎవరికి అందించాలన్న తపనతో ఆలోచన చేస్తే ఆయన దష్టిలో పడిందని, దళితుల సాధక బాధకాలేనని ఆయన చెప్పారు. దళిత వర్గాల్లో అన్ని వర్గాలకు సరిసమానంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ తపన అన్నారు. అందరికీ అందుబాటులోకి దళిత క్రాంతి పథకాన్నిఅందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.దశల వారీగా పెంచడం జరుగుతుందన్నారు. బడ్జెట్ ఎంతైనా పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దంగా ఉన్నారన్నారు. మొదటి దశలో రూ.1200 కోట్లతో నియోజకవర్గానికి వంద మంది చొప్పున రూ.10 లక్షలు అందించనున్నట్టు వెల్లడించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకొచ్చిన మీదటనే కార్పొరేట్ విద్యకు సరిసమానంగా ఎస్సీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కకాశాలలు ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అంతేగాకుండా విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థులకు ఉపకార వేతనాన్ని రూ.20 లక్షలకు పెంచింది ముఖ్యమంత్రి కేసీఆరేనన్నారు. మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కతజ్ఞతలు తెలిపేందుకు సభను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే నోముల భగత్‌ను అభినందించడంతో పాటు, సభకు నియోజకవర్గం నలుమూలల నుండి తరలివచ్చిన దళిత కుటుంబాలకు మంత్రి కతజ్ఞతలు తెలిపారు.స్థానిక శాసనసభ్యులు నోముల భగత్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేచిరుమర్తి లింగయ్య, జెడ్పీ వైస్‌చైర్మెన్ ఇరిగి పెద్దులు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్రనాయక్, సీనియర్ టీఆర్ఎస్ నేతలు ఎంసీకోటిరెడ్డి, ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, మున్సిపల్చైర్మెన్, ఎంపీపీలు,ఎంపీటీసీలతో పాల్గొన్నారు.