Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత్తులో జోగుతున్న యువత
- మొద్దునిద్ర వీడని అధికారులు
నవతెలంగాణ-నల్లగొండ
నిషేధితగుట్కా విక్రయాలపై అధికారుల నిఘా కరువైంది.జిల్లాలో గుట్కావ్యాపారం 'మూడు పువ్వులు ఆరు కాయలుగా'వర్ధిల్లుతోంది.తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీష్‌ఘడ్ నుంచి అర్ధరాత్రి వేళలో గుట్కా ప్యాకెట్లను తెలుగురాష్ట్రాలకు తీసుకొస్తున్నారు.తద్వారా ఇక్కడి వ్యాపారులు బహిరంగంగా గుట్కాలు విక్రయిస్తున్నా పట్టించుకునేనాథుడే కరువయ్యాడు. జిల్లాలోని ప్రతి కిరాణాషాపు, పాన్షాపుల్లోనూ నిషేధిత గుట్కా అంబర్ ప్యాకెట్లు జోరుగా విక్రయిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహ రిస్తున్నారు.కొంతమంది సంబంధిత అధికారులకు కూడా గుట్కాలు తినే అలవాటు ఉన్నట్టు సమాచారం.సంబంధిత అధికారుల కనుసన్నల్లోనే దందా సాగుతున్నట్టు తెలుస్తుంది.
జోరుగా అమ్మకాలు...
జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాలలో గుట్కా దందా జోరుగా కొనసాగుతోంది.దీంతోపాటు గ్రామాలలోని వివిధ కిరాణా దుకాణాల్లో అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి.కొందరు బడా వ్యాపారులు ఇతరరాష్ట్రాల నుంచి పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసి రాత్రి వేళల్లో తీసుకొస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.వారానికి ఒకసారి ద్విచక్రవాహనాలపై కిరాణా షాపులకు సరఫరా చేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది .
చిరువ్యాపారులపైనే చర్యలు...!
గుట్కా అక్రమ వ్యాపారంపై సంబంధిత అధికారులు కూడా చూసీచూడనట్టుగా వ్యవహరి స్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.పోలీసులు జరుపుతున్న దాడుల్లో చిరు వ్యాపారులు మాత్రమే పట్టుబడుతున్నారు.బడా వ్యాపారులపై ఎందుకు దాడులు జరపడం లేదన్న విమర్శలు గుప్పు మంటున్నాయి.పోలీసులు పాన్ షాపులపై,కిరాణా షాపులపై దాడులు నిర్వహించి పట్టుకుని కేసులు నమోదు చేసుకున్నప్పటికీ గుట్కా వ్యాపారులు తమ పద్ధతులు మార్చుకోవడం లేదు.
మత్తులో యువత....
నిషేధిత గుట్కా ప్యాకెట్ల విక్రయాలు జిల్లాల్లో జోరుగా సాగుతుండడంతో యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు.చిన్న వయస్సులోనే అలవాటుపడి తన జీవితాన్ని నాశనం చేసు కుంటున్నారని ఆరోపణలు వ్యక్తమ వుతున్నాయి.గుట్కా ప్యాకెట్లు తింటూ యువత చెడు వ్యసనాలకు గురవుతున్నారు.పోలీస్ యంత్రాంగం అడపాదడపా నిషేధిత గుట్కా విక్రయాలపై దాడులు నిర్వహించి చేతులు దులుపుకోవడంతో గుట్కా వ్యాపారులు రెచ్చి పోతున్నారు.ఇకనైనా ఉన్నతాధికారులు దష్టి సారించి నిషేధితగుట్కా ప్యాకెట్ల విక్రయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చత్తీష్‌ఘడ్ నుండి సరఫరా....
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు రాష్ట్రమైన చత్తీష్‌ఘడ్ నుంచి నిషేధిత గుట్కాప్యాకెట్లు వాహనాల ద్వారా సమీపగ్రామాలకు తరలించి భారీఎత్తున నిల్వ చేస్తున్నారని సమాచారం.అక్కడి నుండి జిల్లాకేంద్రాలకు తరలించి వ్యాపారులు విక్రయాలు జరుపుతున్నారని జరుపుతున్నారని తెలిసింది.నిషేధిత గుట్కా ప్యాకెట్లపై నీకు కరువవడంతో వారి అక్రమ వ్యాపారానికి అడ్డూ అదుపూ లేకుండాపోతుంది.దీంతో జోరుగా విక్రయాలు జరిపిన వ్యాపారులు లక్షలాది రూపాయలు గడిస్తున్నారు.ఈ తతంగం కొన్ని నెలల నుండి కొనసాగుతున్నప్పటికీ పట్టించు కునేనాథుడే కరువయ్యాడు.అధికారులు సైతం నిషేధితగుట్కా ప్యాకెట్లు విక్రయాలపై అంతంత పట్టించుకోక పోవడంతో వారి వ్యాపారం జోరుగా కొనసాగుతోంది.