Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై మరిన్ని ఉద్యమాలు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
- సూర్యాపేటలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
నవతెలంగాణ-సూర్యాపేట
రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాల ధరల పెంపుతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారామ ఫంక్షన్హాల్లో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటి నుంచి పార్టీ గ్రామ శాఖా సమావేశాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ మహాసభల సందర్భంగా అన్ని గ్రామాల్లోనూ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను క్షుణ్నంగా చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందిస్తామని తెలిపారు.కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని దెబ్బ తీసేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. అంబానీ, ఆదానిలకు పెద్దపీట వేస్తున్న మోడీ ప్రభుత్వం పేదలపై మాత్రం భారాలు వేయడం సరికాదన్నారు. అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. దళిత సాధికారత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందన్నారు. ఈ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు. మహాసభల సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేసి వాటి సమస్యల పరిష్కారం కోసం మండల, గ్రామ స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మి, ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, ధీరావత్ రవినాయక్, జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, ఎల్గూరి గోవింద్, కోట గోపి, మట్టిపెళ్లి సైదులు, దండ వెంకట్‌రెడ్డి, జిల్లేపల్లి నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, వేల్పుల వెంకన్న, బుర్ర శ్రీనివాస్, కందాల శంకర్‌రెడ్డి, నగరపు పాండు, షేక్ యాకూబ్అలీ, చింతల వెంకటరెడ్డి, కొదమగుండ్ల నగేష్, కందగట్ల అనంతప్రకాష్, మేకనబోయిన శేఖర్, నాయకులు వీరబోయిన రవి, మేకనబోయిన సైదమ్మ, జంపాల స్వరాజ్యం, కొప్పుల రజిత తదితరులు పాల్గొన్నారు.