Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
డీవైఎఫ్ఐ ద్వితీయ రాష్ట్ర మహాసభలు జిల్లాలోని చిట్యాల మండలకేంద్రంలో ఆగస్ట్ 1,2వ తేదీలలో జరుగుతున్నాయని, ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా 400మంది ఎంపిక చేసిన ప్రతినిధులు హాజరవుతున్నారని, మహాసభలకు అన్ని విధాలుగా సహకరించి జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రవినాయక్, రాష్ట్ర నాయకులు ఎమ్‌డి.అంజద్‌లు కోరారు.శుక్రవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని, నాటి పోరాట వీరుల త్యాగపు వారసత్వాన్నితలకెత్తుకొని డీవైఎఫ్ఐ కొనసాగిస్తుందన్నారు.1980లో పంజాబ్‌లోని లూథియానాలో నవంబర్ 1,2,3 తేదీల్లో జరిగిన మొదటి మహాసభల్లో డీవైఎఫ్ఐ ఏర్పడిందన్నారు. నాటి నుండి నేటి వరకూ విద్య, ఉపాధి కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. తమ దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం అని 40 ఏండ్లుగా దేశ రక్షణ కోసం అనేక త్యాగాలు చేసింది డీవైఎఫ్ఐ అన్నారు. ఉగ్రవాద బాంబు దాడులు పేలుళ్ల బాధితులను ఆదుకోవడంలో, ప్రకతి విపత్తులు సంభవించినప్పుడు సహాయ కార్యక్రమాలలో ముందుందన్నారు. ఆధునిక సమాజమంతా కాలుష్యం విస్తరిస్తున్న ఈ పరిస్థితుల్లో ''మొక్కలు నాటండి-ఆక్సిజన్‌ను ఆస్తిగా ఇవ్వండి '' అంటూ లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉదతంగా నిర్వహించిందన్నారు. తెలుగు నేలకు 20 శాతం ఆక్సిజన్‌ను ఇస్తున్ననల్లమల అడవులను విద్వంసం చేసే కుట్రలను తిప్పికొట్టడంలో కీలకంగా ఉండి దేశ రాజధాని ఢిల్లీ వరకూ పోరాటం నడిపిందన్నారు. అందరికీ విద్య, ఉపాధితోనే దేశాభివద్ధి సాధ్యమని కోరుతు న్నదన్నారు. కానీ ప్రతి ఏటా 2కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం దేశంలో ఖాళీగా ఉన్న60లక్షల కూడా భర్తీ చేయక యువతను మోసం చేస్తుం దన్నారు.ఇంకా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకు పోయేందుకు నిర్వహించే ద్వితీయ రాష్ట్ర మహాసభలకు తెలంగాణ నలుమూలల నుండి ప్రతినిధులు, ఇతర రాష్ట్రాల నుండి సౌహార్ద ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవు తున్నారన్నారు. ఈ మహాసభలకు ఆర్థికంగా, హార్దికంగా అండదండలనిచ్చి జయప్రదం చేయాలని కోరారు.