Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఎంపీపీ గుండగాని కవిత రాములుగౌడ్ అన్నారు. శుక్రవారం పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని తూర్పుగూడెం, సంగెం, గుడితండా గ్రామపంచాయతీల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. పలుచోట్ల మొక్కలు నాటి మాట్లాడారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. హరితహారంలో భాగంగా గ్రామాలన్నీ పచ్చగా మారాయని తెలిపారు. పెండింగ్లో ఉన్న పల్లె ప్రకృతివనం, డంపింగ్ యార్డు, స్మశాన వాటిక తదితర పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రామారావునాయక్, ఎంపీడీవో లక్ష్మి, ఎంపీవో భీమ్ సింగ్నాయక్, ఏపీవో వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు గుండగాని రాములుగౌడ్, మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు నల్లు రాంచంద్రారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు గుజ్జ పూలమ్మ, ఏశమల్ల సుశీలసామెల్, భారతి పుణ్య నాయక్, ఎంపీటీసీ ఏలెజర్, ప్రత్యేకాధికారులు బాలకృష్ణ, సుధాకర్, అనూష, పంచాయతీ కార్యదర్శులు పోలేపాక చైతన్య, శేఖర్, సురేష్, అంగన్వాడీ టీచర్లు జ్యోతి, అంజలి, రాజేశ్వరి, సుభద్ర, ఏఎన్ఎం దేవేంద్ర, ఆశా కార్యకర్తలు శ్రీదేవి, నాగమణి, మాధురి, పద్మ, వసంత తదితరులు పాల్గొన్నారు.