Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య
నవతెలంగాణ-హాలియా
వ్యవసాయ కార్మికులను కూలాల వారీగా పని చెప్పి వేతనాలివ్వాలనే ఆలోచనను విరమించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య కేంద్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.శుక్రవారం మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 'కూలాల వారీగా వేతనాలివ్వడం రాజ్యాంగ విరుద్ధం' అనే ఆంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహి ంచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హమీ చట్టంలో ఐక్యంగా పని చేస్తున్నకూలీల మధ్యన కులగర్జన సష్టించడానికి మోడీ ప్రభుత్వం జీవో తెచ్చిందన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి చట్టాన్ని లేకుండా చేయడం కోసం ఈ కుట్రని కార్మిక, ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలు చట్ట రక్షణ కోసం పోరాడాలని కోరారు.ఉపాధిహామీచట్టంలో పని చేస్తున్న కూలీలను కులాల వారీగా విభజన చేసి వేతనాలివ్వాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పని చేయగలిగే ప్రతి ఒక్కరికీ కులం, మతం, ప్రాంతం, లింగ వివక్ష లేకుండా పని కల్పించాలనే చట్టం స్పూర్తికి విఘాతం కలిగించే చర్యలు అన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆడ, మగ అనే తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చట్టం డైరెక్షన్‌ను తూట్లు పొడుస్తున్నారన్నారు. కరోనా వల్ల పట్టణ ప్రాంతాల్లో ఉన్నకార్మికులు గ్రామాలకు వెళుతున్నారని, వారందరికీ పని కల్పించాలంటే పని దినాలు పెంచాలని, పట్టణ ప్రాంతాల్లోకి విస్తరణ చేయాలని, రోజు కూలి రూ.600, పని దినాలు 200 పెంచాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహయ కార్యదర్శి జటావత్ రవినాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఖమ్మంపాటి శంకర్, సీఐటీయూ నాయకులు పొదిల్ల వెంకన్న, ప్రజా సంఘాల నాయకులు కాసాని యాదయ్య, మాదరబోయన అంజయ్య, కొండేటి సైదయ్య, కోలుకులపల్లి ఊశెన్, ఇంద్రావతి, అచ్చులు, యడవల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.