Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం అన్నారు.శుక్రవారం తిమ్మారెడ్డి గూడెం, తేరట్పల్లి గ్రామాల్లో ఆయనమొక్కలు నాటి మాట్లాడారు.అనంతరం ఎంపీడీఓ బాలకృష్ణ పల్లెప్రకృతివనాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మనోహర్, సర్పంచ్ రాములమ్మ, ఎంపీటీసీ గోరిగె సత్తయ్య, ఏపీఓ స్వరూపరాణి, పీఆర్ ఏఈ రమేశ్, పంచాయతీ సెక్రెటరీ శివ, స్పెషలాఫీసర్ మౌనిక, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నాంపల్లి :పల్లెప్రగతితో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతారవీందర్రెడ్డి అన్నారు.మండలంలోని పలు గ్రామాల్లో ఆయన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.మొక్కలు నాటారు.నామనాయక్తండాలో మండలపరిషత్ నిధుల నుండి నిధులు కేటాయించి బోరు వేయించారు.అనంతరం పల్లెప్రకృతివనాన్ని పరిశీలించారు.పసునూరు గ్రామంలో మండలపరిషత్ నిధుల నుండి మంజూరైన నిధులతో ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ పనులను ప్రారంభించారు. మల్లపురాజ్పల్లి,చల్లవానికుంట,లింగోటం గ్రామాల్లో పల్లెప్రకతి వనాలను పరిశీలించి మొక్కలు నాటారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ సుగుణ శంకర్‌నాయక్,పోగుల దివ్య,రాపోలు దేవేంద్ర, సత్యనారాయణ, మునగాల సుధాకర్‌రెడ్డి, పాండు, ఎంపీడీఓ శేషుకుమార్, మండల కో ఆప్షన్‌సభ్యులు ఎస్కె.అబ్బాస్, ఆర్‌డబ్య్లూఎస్ ఏఈ మహ్మద్, నాయకులు గుమ్మడపు నర్సింహారావు, పోగుల వెంకట్‌రెడ్డి, కడారి శ్రీశైలం, బత్తుల విజరు, వార్డు సభ్యులు సాలయ్య, వెంకన్న,రంగయ్య, జానీ,శేఖర్ పాల్గొన్నారు.
మునుగోడు: మండలంలోని దుబ్బకాల్వ గ్రామంలో అవెన్యూప్లాంటేషన్, పల్లెప్రకృతివనం, కంపోస్టుషెడ్ల నిర్మాణాలను మండల ప్రత్యేకాధికారి హుస్సేన్బాబా, ఎంపీడీఓ యాకుబ్ సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వీధుల్లోనూ మొక్కలు నాటాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ సుమలత, ఏపీఓ శ్రీనయ్య, సర్పంచ్, గ్రామ స్థాయి నోడల్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు సర్వతోముఖాభివద్ధి చెందుతున్నాయని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు.నియోజకవర్గంలోని దొండవారిగూడెం గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే భాస్కర్‌రావు పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ విశేష కషి చేస్తున్నారని అన్నారు. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్యంపై ప్రత్యేక దష్టి పెట్టేందుకు వీలుగా చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను మంజూరు చేయడంతో పాటు డంపింగ్ యార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. గ్రామస్తులకు మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన జలాలను సరఫరా చేస్తున్నదన్నారు.అనంతరం ఏడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మొక్కలను నాటారు.ఒక్కొకరికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, ఏఎంసీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హన్మంతరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, ఎంఈవో బాలాజీ సింగ్, సర్పంచ్ అలకాని సుజాత రమణ, చౌగాని భిక్షంగౌడ్, ఉపసర్పంచ్ సుశీల, నాయకులు శివ, నక్క వెంకన్న, ఏడు కొండలు, తరి ఎల్లయ్య, మంగమ్మ, వార్డు మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని గోగువారిగూడెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో రోడ్లు సందర్శించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ సింహారెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంతరెడ్డి, మాజీ సర్పంచ్ ఏడుకొండలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ చిట్టిబాబు, భిక్షంగౌడ్, ఎంపీడీఓ దేవిక, ఎంపీటీసీ పాశం హైమావతి, నర్సింహారెడ్డి, సర్పంచ్ ఎలకాని సుజాత రమణ పాల్గొన్నారు.
కేతెపల్లి : ప్రకతివనంతో పల్లెలు పచ్చదనంగా మారుతున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని కొర్లపహడ్, కొత్తపేట గ్రామంలో చేపట్టిన పల్లె ప్రకతివనం,అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి ప్రారంభి ంచారు.అనంతరం మాట్లాడుతూ చెత్తను రోడ్లపై వేయకుండా ట్రాక్టర్ల ద్వారా ఊరిబయట వేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెరుమాళ్ల శేఖర్, స్పెషలాఫీసర్ స్వర్ణలత, డిప్యూటీ సీఈఓ కాంతమ్మ, ఇన్చార్జి ఎంపీడీవో భవాని, ఏపీఓ రామ్మోహన్, కొర్లపహాడ్, కొత్తపేట గ్రామాల సర్పంచులు ఎడ్ల పార్వతమ్మ, బచ్చు జానకిరాములు, ఎంపీటీసీలు బుర్రి యాదవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నల్లగొండకలెక్టరేట్ : మండలంంలోని దోమలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధికారులతో గ్రామంలో ప్రతి వీధిని పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ముచ్చటిస్తూ గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వీధులలో మురికి కాలువలను, సీసీరోడ్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు మండల పరిషత్ అభివద్ధి అధికారి శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, మండల విద్యాధికారి నర్సింహ, సర్పంచ్ ఉపేంద్రా చారి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి :హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో నాటిన టువంటి ప్రతిమొక్కనూ సంరక్షించి పెంచి పెద్ద చేయాలని జెడ్పీ సీఈవో వీరబ్రహ్మ చారి అన్నారు.మండలపరిధిలోని కేశ్యతండాలో ఆయన మొక్కలు నాటి నీళ్ళు పోశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌గౌడ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కేసని లింగారెడ్డి, రమావత్దస్రునాయక్, ఎంపీడీవో బాలరాజ్రెడ్డి, సర్పంచ్ రమావత్ జ్యోతి,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, మాడ్గులయాదగిరి, కాశయ్య, అబ్బనబోయిన శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.
చండూరు : పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలు మొక్కలు నాటాలని గట్టుప్పల్ గ్రామ సర్పంచ్ సర్పంచ్ కుమారి ఇడం రోజా తెలిపారు. వావిళ్ళపల్లి రోడ్డు నందు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సాయిలు, గ్రామ కార్యదర్శి షఫీ, వార్డు సభ్యులు శంకరయ్య పాల్గొన్నారు.