Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
కార్పొరేట్ విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాస్లు పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధికఫీజులు వసూలు చేస్తున్నాయని, వాటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ డిమాండ్ చేశారు.శుక్రవారం మండలకేంద్రంలో నిర్వహించిన ఆ సంఘం ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.విద్యాసంస్థలు ట్యూషన్ ఫీజు మాత్రమే నెలవారీగా తీసుకోవాలని ప్రభుత్వం ప్రకటించినా కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం గతంలో మాదిరిగానే ఏడాది ఫీజు ఒకేసారి వసూలుచేస్తున్నాయని విమర్శించారు.ప్రభుత్వ ఉద్యోగాలు రాక కొంత మంది నిరుద్యోగులు కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రయివేట్ విద్యా సంస్థలను ఆదుకోవాలని కోరారు.ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జిట్ట రమేశ్, నవీన్, హరీష్, గోలిసాయి, పవన్ పాల్గొన్నారు.