Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామరచర్ల
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం వాడపల్లి గ్రామ శాఖ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.కరోనా కాలంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు రైతు, కార్మిక. వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ప్రజలు తీవ్ర నష్టం కలిగించాయని విమర్శించారు. ప్రభుత్వం ప్రయివేటీకరణ పేరుతో ప్రభుత్వ సంస్థలైన బీఎస్ఎన్ఎల్,ఎల్ఐసీలను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు.బొగ్గుగనులు,విద్యుత్,బీఎస్ఎన్ఎల్,విశాఖ స్టీల్లని నష్టాలని చూపి ప్రయివేట్ వ్యక్తులకు ఆదానీ, అంబానీలకు అమ్మడం సరికాదన్నారు.పెట్రోల్, డీజిల్‌ధరలు పెంచుతున్నాయని, నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నా యన్నారు.కరోనా కాలంలో ఆక్సిజన్ అందక చాలా మంది చనిపోయారని, హాస్పిటల్లో సరైన వైద్యం లేక నిత్యం వేల మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారక పోతే పెద్దఎత్తున ప్రజా పోరాటాల ద్వారా ఆందోళనలు చేపడ్తామని హెచ్చరించారు.కమ్యూనిస్టు దేశాలే కరోనాను ఎదుర్కుని నిలబడ్డాయన్నారు.ఎర్రకోట మీద ఎర్రజెండాను ఎగిరినప్పుడే ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయన్నారు.ఈ మహాసభలో జిల్లా కమిటీ సభ్యులు రవినాయక్,మండల కార్యదర్శి వినోద్‌నాయక్, సీనియర్ నాయకులు పాపానాయక్, సీఐటీయూ నాయకులు దయనంద్,సైదులు,ఖాజామోయినుద్దీన్, రవి, పిచ్చయ్య, భిక్షం, పుల్లయ్య పాల్గొన్నారు.
నకిరేకల్ లో 14 మందికి కరోనా పాజిటివ్
నకిరేకల్ :నకిరేకల్ ప్రభుత్వాస్పత్రిలో 115 మందికి, ఓగోడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 125 మందికి శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షలో 14 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని వైద్యులు తెలిపారు.