Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు రోజుల్లో నాలుగు ఇండ్లల్లో చోరీ
- పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో మండల ప్రెస్ క్లబ్ వెనకలా దొంగతనం
నవతెలంగాణ -బొమ్మలరామారం
వరుస దొంగతనాలతో బొమ్మలరామారం మండలకేంద్రంలో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.రెండు రోజలుల్లో నాలుగు ఇండ్లల్లో చోరీ జరగడంతో ప్రజలు రాత్రిపూట మేల్కోని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అర్ధ రాత్రి సమయంలో ఎవరూ లేని ఇండ్లను టార్గెట్ చేస్తూ నగదు,వెండి, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తున్నారు. బొమ్మలరామరం గ్రామానికి చెందిన బాణాల కష్ణ తన మేడ్చల్ జిల్లా ధమ్మాయిగూడలోని తన బంధువుల ఇంట్లో దొంగలు పడ్డారని తెలుసుకుని వారిని పరామర్శించేందుకు వెళ్లాడు. శుక్రవారం అర్ధరాత్రి అతని ఇంట్లో దొంగలుపడి తులం బంగారం,25 తులాల వెండి,పదివేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. అదే గ్రామానికి చెందిన ఎల్లబోయిన హరి బాబు తన తల్లి ఇంట్లో సుమారు 22 తులాల వెండి,39,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో విచారణ చేపట్టారు. కానీ మరుసటి రోజుశనివారం రాత్రి పోలీస్ స్టేషన్కు కూత వేటు దూరంలో గుడిభావి చౌరస్తా పక్కనే ఉన్న మండల ప్రెస్ క్లబ్ వెనకాల నివసిస్తున్న బండి మహేష్ ఇంట్లో చోరీ జరిగింది.మహేష్ తన కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్ళి ఆదివారం ఉదయం తిరిగి వచ్చే సరికి ఇంట్లోని సామాన్లు,బట్టలు చల్లా చదురుగా పడి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేసురుకుని క్లూస్ టీమ్ సహాయంతో వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా అంతకు ముందు రోజు అర్ధరాత్రి ఒకే రాత్రి మూడిళ్లలో దోపిడీ జరిపి దొంగలు బీభత్సం సష్టించారు.ఈ సంఘటన జరిగి ఒక్క రోజు కూడా గడవకముందే మరో దోపిడీ జరిగింది. ఇదంతా చూస్తుంటే నిఘా సరిగా లేకనే దొంగలు రెచ్చి పోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.