Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-తుర్కపల్లి
ఆలేరు నియోజకవర్గానికి సాగునీరందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్ చేశారు. ఆదివారం మండలకేంద్రంలో ఆ పార్టీ మండల విస్తత సమావేశం నాగపురి నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏండ్లుగా సాగు ,తాగునీటి సాధన కోసం ఆలేరు నియోజకవర్గ ప్రజలు చాలా ఉద్యమాలు నిర్వహించినప్పటికీ అప్పటి ప్రభుత్వాలు టీడీపీ, కాంగ్రెస్ ,ఇప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వాలు ఈ ప్రాంత సమస్యలపై దష్టి సారించడం లేదన్నారు.సీఎం ఫామ్ హౌస్ కు సమీపంలోనే ఉన్న గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎత్తు ప్రదేశంలో ఉన్న తుర్కపల్లి బొమ్మలరామరం, మండలాలకు సాగు, త్రాగు నీరు ఎలా అందిస్తారో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇండ్లు కోల్పోయిన వారికి ఇండ్లు, భూములు కోల్పోతున్న వారికి భూములు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం వంటి చర్యలు చేపట్టి, గ్రామస్తుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల పార్టీ కార్యదర్శి సిలువేరు దుర్గయ్య, ఈదులకంటి రమేష్ బబ్బురి బాను పల్లెపాటి జమ్మయ్య, కొండ అంజమ్మ మల్లయ్య,వల్లపు భగవంతు,బానోతు యాదమ్మ, నాగారం అంజయ్య,మైపాల్, బత్తుల కుమార్ ,లక్ష్మణ్, సిల్వేర్ స్వరూప, వల్లపు వెంకటయ్య, కాశ బోయిన పెద్దులు పాల్గొన్నారు.