Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పేరుకే పార్ట్ టైం.. చేసేది ఫుల్ టైం
- పనిభారంతో పీహెచ్సీ కంప్యూటర్ ఆపరేటర్ల అవస్థలు
- కనీసం వర్కర్లుగా కూడా గుర్తించని ప్రభుత్వం
- ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచాలని వేడుకోలు
- నేటి నుంచి ఎన్ హెచ్ఎం ఉద్యోగుల ఆందోళన బాట
నవతెలంగాణ-మోత్కూర్
పేరుకు వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) ద్వారా పార్ట్ టైం ఉద్యోగం పేరుతో విధుల్లోకి తీసుకున్నప్పటికీ పొద్దస్తమానం పని భారమే. అయినా ప్రభుత్వం తమను ఎప్పుడో ఒకప్పుడు గుర్తించి జీతాలు పెంచి పర్మనెంట్ చేస్తోందన్న ఆశతో ఆ చిరుద్యోగులు ఏండ్లతరబడి పని చేస్తున్నా ప్రభుత్వం వారిని కనీసం ఆ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులుగా కూడా గుర్తించక పోవడం, కరోనా సమయంలోనూ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేసినప్పటికీ గుర్తించకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. దీంతో తమను ఉద్యోగులగా గుర్తించాలని, పీఆర్సీ వర్తింపజేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి ఆందోళన 4మిగతా 3లో...
పని బారెడు... జీతం మూరెడు..బాట పట్టారు.
కంప్యూటర్ ఆపరేటర్ల పై పనిభారం
నేషనల్ హెల్త్ మిషన్ స్కీం(ఎన్ హెచ్ఎం)లో జిల్లా, అప్పర్ ప్రైమరీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు (డీఈవో) పని చేస్తున్నారు. పార్ట్ టైం ఉద్యోగం పేరిట వారిని నియమించినప్పటికీ పనిభారం తో రోజంతా పని చేస్తున్నారు. ఉద్యోగం చిన్నదైనా ఆస్పత్రుల నిర్వహణలో వారి పాత్ర ఎంతో కీలకం. ఆస్పత్రికి సంబంధించిన ప్రతి సమాచారం ఆన్ లైన్ చేయడం, రిపోర్టులు తయారు చేసి అధికారులకు పంపడం, ఉన్నతాధికారులు ఎప్పుడు ఏ సమాచారం అడిగినా మెయిల్ పంపడం వీరి పని. పీహెచ్ సీల్లో ఓపీ ఎంట్రీ, కేసీఆర్ డాటా ఎంట్రీ, నెలవారీ రిపోర్టులు, ఆశా బిల్స్, కోవిడ్ టెస్టులు, కోవిడ్ వ్యాక్సినేషన్ ఎంట్రీ లాంటి 18 రకాల పనులు నిర్వహిస్తున్నారు. పీహెచ్‌సీల్లో 132 మంది పని చేస్తుండగా ఇందులో కొందరికి రూ.10500, మరికొందరికి 11 వేలు చెల్లిస్తున్నారు. పీహెచ్‌సీల్లో అధికారులకు ఇబ్బందులు లేకుండా మూడేండ్లుగా ఎంతో కీలకంగా పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వారిని కనీసం ఉద్యోగులుగా కూడా గుర్తించడం లేదు. ఆస్పత్రుల్లో కంప్యూటర్ ఆపరేటర్లను ఏ జాబితాల్లో చూపించడం లేదు. తమను ఉద్యోగులుగా గుర్తించి నెలకు రూ.24,250 వేతనం ఇవ్వాలని కోరుతున్నారు.
నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో...
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) స్కీంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాతో వైద్య, ఆరోగ్య శాఖలో కంప్యూటర్ ఆపరేటర్లు, యూపీహెచీసీ కమ్యూనిటీ ఆర్గనైజర్, సబ్ స్టాఫ్, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్, వాచ్ మెన్, స్వీపర్, నాల్గవ తరగతి సిబ్బంది, కంటింజెంట్ ఉద్యోగులతో పాటు 16 రకాల ఉద్యోగులు పని చేస్తున్నారు.
ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు
వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్ హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పీఆర్సీ అమలు చేసి జీవో 510, 60 ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ 16 రకాల ఉద్యోగ సంఘాలు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టాయి. ఈనెల 12న కలెక్టరేట్ల ముందు ధర్నాలు, మెడికల్ ఆఫీసర్లకు, డిఎంహెచ్ ఓలకు, సూపరింటెండెంట్లకు, కమిషనర్లకు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి వినతిపత్రాలు, 15న సమ్మె నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు.
ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచాలి
ఫోటో: కమ్రాన్, కంప్యూటర్ ఆపరేటర్, యాదగిరిగుట్ట
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేను మూడేండ్లుగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న. ఉద్యోగం పార్ట్‌టైం అయినా వివిధ రకాల రికార్డుల ఆన్లైన్ చేయడం, ఉన్నతాధికారులు ఎప్పుడు ఏ రిపోర్టు అడిగినా వెంటనే ఇవ్వాల్సి వస్తుండడంతో రోజంతా ఆస్పత్రిలోనే పని చేస్తున్నాం. కనీసం మమ్మల్ని ఉద్యోగులగా కూడా గుర్తించడం లేదు. పనిభారం పెరుగుతుంది. పనికి తగ్గట్టుగా వేతనం రావడం లేదు. ఉద్యోగులుగా గుర్తించి పీఆర్సీ వర్తింపజేసి వేతనాలు పెంచాలి.
వెట్టిచాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం
ఫోటో: కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, యాదాద్రి
వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ విభాగాలు, స్కీంలలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకుంటుంది. గతంలో సీఐటీయూ పోరాటాల ఫలితంగా కొన్ని రకాల సిబ్బందికి వేతనాలు పెరిగాయి. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలందించిన వివిధ రకాల ఉద్యోగులు, సిబ్బందిని పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి. పీఆర్సీ వర్తింపచేసి కనీస వేతనాలు ఇవ్వాలి.
బాట పట్టారు.