Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెల రోజుల్లో 5 శాతానికి తీసుకురావాలని ఆదేశం
- వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రీజ్వీ
నవతెలంగాణ -నకిరేకల్
నకిరేకల్ పట్టణంలో లాక్డౌన్ విధించి అదనంగా పది రోజులు పొడిగించిన అప్పటికీ సరైన అదుపులోకి రాకపోవడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ ఏఎం రిజ్వీ విచారం వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలో కోవిడ్ నియంత్రణలో భాగంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో డిఎంహెచ్ఓ, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, డీపీఓ, మున్సిపల్ కమిషనర్, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల రోజులలో 5 శాతానికి కరోనా కేసులను తగ్గించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం మరోసారి జ్వర సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా వివాహాలు, జాతరలు జరిగే చోట జనం రద్దీ అధికమవ్వడంతో వైరస్ విస్తరిస్తుందన్నారు. ఇలాంటి శుభకార్యాల పై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరు విధిగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించే విధంగా చూడాలన్నారు లేనిపక్షంలో వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. డీిఎంహెచ్ఓ కొండల్ రావు మాట్లాడుతూ ఇప్పటివరకు 45 ఏండ్లు దాటిన వారికి మొదటి డోసు 97,785 మందికి, రెండవ డోసు 17,714 మందికి వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు. అలాగే 19 సంవత్సరాలు దాటిన వారికి మొదటి డోసు 95,566 మందికి,రెండవ డోసు1528మందికి వేశారన్నారు.ఈ సమావేశంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆర్డీఓ జగదీ శ్వ ర్ రెడ్డి,డి యం హెచ్ ఒ కొండల్ రావు, ట్రైని కలెక్టర్ అపూర్వ చౌహాన్, డాక్టర్ శ్రీనివాస రావు, గంగాధర్ రావు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.