Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజేందర్‌కు భౌతికశాస్త్రవిభాగంలో డాక్టరేట్
తుంగతుర్తి :మండలంలోని రావులపల్లి ఎక్స్రోడ్డుతండాకు చెందిన గుగులోత్ అమల-పాప దంపతుల కుమారుడు గుగులోత్ రాజేందర్ భౌతిక శాస్త్రవిభాగంలో డాక్టరేట్ సాధించారు.రాజేందర్ 5వతరగతి వరకు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, 10వ తరగతి వెంపటి ఉన్నత పాఠశాలలో పూర్తి చేసాడు.తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా కుమారునికి చదువుపై ఉన్న ఆసక్తిని గమనించి తొర్రూరులో ఇంటర్మీడియట్‌ను, సూర్యాపేట లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేర్పించి ఉన్నత చదువులు చదివించారు.కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే భౌతికశాస్త్రంపై ప్రత్యే కమైన శ్రద్ధ చూపేవారు.ఆ తర్వాత అమ్మానాన్నల ప్రోత్సాహంతో, అధ్యాపకుల సలహా మేరకు పోస్ట్‌గ్రాడ్యుయేట్‌లో భౌతికశాస్త్రం ప్రవేశ పరీక్షలో మంచిర్యాంకుతో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, క్యాంపస్ నందు సీటు సంపాదించారు.కుమారుని తెలివితేటలకు తల్లిదండ్రులతో పాటు, బంధువులు,తండా ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేశారు.భవిష్యత్‌లో మరింతగొప్పవాడు కావాలని కోరుకున్నారు.వారి ఆకాంక్షలకనుగుణంగానే రాజేందర్ అధ్యాపకవృత్తిలో చేరాలనే కోరికతో ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీ,అటు తరువాత 2011భౌతిక శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు.2013లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, ఉపాధ్యాయ వత్తిలో చేరి అందరి మన్ననలు పొందారు. అంతటితో రాజేందర్ తన చదువును ఆపలేదు ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అన్నట్లుగా ఒకవైపు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూనే మరొకవైపు మిగిలిన సమయంలో చదువుకుంటూ యువ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలకు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అర్హత పొందడానికి జాతీయ స్థాయిలో నిర్వహించే సీఎస్ఆర్ఎన్ఈటీ (2015) పరీక్షకు సంసిద్ధుడయ్యాడు. కఠినశ్రమ, సరైన ప్రణాళికతో చదవడం వల్ల మొదటి ప్రయత్నంలోనే %జూ×=-చీజుు% పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు, 2017లో సీఎస్ఆర్ఎన్జేఆర్ఎఫ్కు కూడా అర్హత సాధించారు.తనఃకలలను నిజం చేసుకోవడానికి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీలో సీటు సంపాదించి 'సింథెసిస్, క్యారక్టరైజేషన్ మాగెటిక్ అండ్ మాగటోరిసిస్టెన్స్ స్టడీస్ ఆఫ్ సమ్ డబుల్ పెర్రో స్కైట్' అనే అంశంపై ఫ్రొఫెసర్ భిక్షమయ్య మార్గదర్శకత్వంలో లోతైన అధ్యయనం చేశారు. ఇతడు రాసిన పరిశోధక వ్యాసాలు జాతీయ,అంతర్జాతీయస్థాయిలో ప్రచురితమయ్యాయి. విశేషమైన కషి ఫలితంగా ఈ సంవత్సరం జూన్ నెలలో పీహెచ్డీ పట్టా అందించినట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగం సంచాలకులు ప్రత్యేక ప్రకటనలో తెలిపారు.పేద కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ పాఠశాలలో చదివి, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ఈ స్థాయికి చేరిన రాజేందర్ ను తుంగతుర్తి ఎంపీపీ గుండగాని కవిత రాములుగౌడ్,స్థానిక సర్పంచ్ గుగులోత్ వెంకన్న ,తెలంగాణ మోడల్‌స్కూల్ టీచర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు యాదవ్, గ్రామప్రజలు బంధుమిత్రులు అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించారు.రాజేందర్ ప్రస్తుతం తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల రామాయంపేట, మెదక్ జిల్లాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ భౌతికశాస్త్ర అధ్యాపకునిగా సేవలందిస్తున్నారు.అన్న ప్రేరణతో తమ్ముడు శంకర్ కూడా ఉన్నత చదువులు చదివి మైసూరులోని బార్క్ పరిశోధనా కేంద్రంలో సాంకేతికవిభాగంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. రాజేందర్ లాంటి వ్యక్తులు మరెందరికో ఆదర్శంగా నిలుస్తారు అనడంలో ఎలాంటి సందేహంలేదు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన తల్లిదండ్రులు, భార్య, గురువులు,మిత్రులు ఎంతగానో ప్రోత్సహించి, సహకరించారని చెప్పారు. తాను నేర్చుకున్న చదువు, చేసిన పరిశోధనల ఫలితాలు అందరికీ చేరేలా మరింత కషి చేస్తానని చెప్పారు.