Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పకడ్బందీగా కరోనా నియంత్రణ చర్యలు
- వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి
- సమీక్షా సమావేశంలో సయ్యద్ అలీ మూర్తుజా రిజ్వీ
నవతెలంగాణ-మిర్యాలగూడ
నేటి నుంచి మూడో విడత ఫీవర్ సర్వే నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ అలీ మూర్తుజా రిజ్వీ ఆదేశించారు.ఆదివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో కరోనా కేసులపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఆ శాఖ కార్యదర్శి రమేశ్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, పీఎస్ఎంఎస్ఐడీ చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి వైద్యారోగ్య శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.నియోజకవర్గంలో కేసులో పెరుగుదలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేములపల్లి, ఆలగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు, ఫలితాలు, పాజిటివ్ వచ్చిన వారికి అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు.మిర్యాలగూడ మండలంలోని బి అన్నారం, వేములపల్లి మండలంలోని మొల్కపట్నం గ్రామాల్లో వెంటనే వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు చేయాలన్నారు. నేటి నుంచి ఇంటింటికీ తిరుగుతూ మూడో విడత సర్వే నిర్వహించాలన్నారు.కరోనా లక్షణాలున్నవారిని గుర్తించి పరీక్షలు చేసి పాజిటివ్ వస్తే వారికి మెడికల్ కిట్ అందించి హౌమ్ ఐసోలేషన్‌లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.నాలుగు రోజుల తర్వాత ఆ కుటుంబ సభ్యులందరికీ, దగ్గరి బంధువులకు కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. అప్పటివరకూ కుటుంబ సభ్యులను సైతం ఐసోలేషన్‌లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తప్పనిసరిగా 14 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండేలా చూడాలని సూచించారు. మూడో విడతలో కేసులు పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ సూచించిందని, దానికనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితిలో కేసులు పెరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజికదూరం పాటించేలా చూడాలన్నారు. అవసరమైతే జరిమానా విధించాలన్నారు.ఈ సమావేశంలో ఆర్డీవో రోహిత్ సింగ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో కేసా రవి, మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న, వైద్యారోగ్య అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు.
ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నాగార్జునసాగర్ :కరోనా తగ్గుముఖం పట్టిందని అయినా ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ్న తెలంగాణ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రీజ్వీ అన్నారు.ఆదివారం ఆయన నాగార్జునసాగర్‌కు విచ్చేయగా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్,డీఎంహెచ్ఓ కొండల్రావు స్వాగతం పలికారు. అనంతరం విజరువిహార్లో జిల్లావైద్య,ఆరోగ్యశాఖ అధికా రులతో నిర్వహిం చిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లాలో కరోన వ్యాప్తి చాలా తగ్గిందని,ఆరోగ్య శాఖ సిబ్బంది బాగా పని చేశారన్నారు. ఇప్పటి నుండి ఒకటి రెండు కేసులు నమోదవుతున్నా వారి నుండి ఇతరులకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకో వాలన్నారు.కరోనా థర్డ్‌వేవ్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాసరావు, తెలంగాణ వైద్య విద్యా శాఖ కార్యదర్శి రమేశ్‌రెడ్డి, డాక్టర్ నరేందర్, కమలానెహ్రు దవాఖాన సీఎంఓ భానుప్రకాశ్, డాక్టర్ మాత్రునాయక్, రాములునాయక్, ఫ్యామిలీ వెల్ఫేర్ అర్బన్ డాక్టర్ విజయకుమారి పాల్గొన్నారు.