Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
యువకులు అత్యున్నతస్థానాలను అధి రోహించేందుకు రవీందర్ ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని పోటీ పడాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ సికిలమెట్ల శ్రీహరి ఆధ్వర్యంలో ఇటీవల ఎంపికైన తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్థానికుడు దాచేపల్లి రవీందర్ కు ఆదివారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో12 యూనివర్సిటీలు ఉండగా తెలంగాణ యూనివర్సిటీ కి స్థానికుడు దాచేపల్లి రవీందర్ వైస్ ఛాన్స్ లర్గా నియమించడం అభినందనీయమన్నారు. అందుకు గ్రామస్తులందరూ సన్మానించు కోవాల్సిన బాధ్యత ఉందన్నారు. యువతి, యువకులు రవీందర్‌ను ఆదర్శంగా తీసుకొని అత్యున్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దాచేపల్లి రవీందర్ భాగ్య లను పూలమాలలు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత సర్వేల్ పూర్వ విద్యార్థి దేవరకొండ సంపత్ కుమార్ ఆచారి, ఎంఏ.భారీ, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు చిలువేరు శంకర్, వంగరి రఘు, ముత్యాల చంద్ర కాంత్, చిలువేరు బిక్షం పాల్గొన్నారు.