Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పులిచింతల ప్రాజెక్టుకు వస్తున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభానును అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
నవతెలంగాణ-చింతలపాలెం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జలా వివాదంతో పులిచింతల ప్రాజెక్టుకు వస్తున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభానును ఆదివారం తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.ముక్త్యాల, బుగ్గమాదారం సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో ముక్త్యాల కృష్ణానది మీదుగా మాదిపాడుకు పడవలో చేరుకుని అక్కడి నుండి ప్రాజెక్టు వద్దకు చేరుకుని ప్రాజెక్టు మీద వైసీపీ నేతలతో ధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సరిహద్దు వద్ద తనను పోలీసులు అడ్డుకున్నారన్నారు.పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.కాసేపు పరిస్థితి ఉద్రిక్తమైందని, తమ పరిధిలో ఉన్న ప్రాజెక్టు వద్దకు అనుమతి ఇవ్వకుండా తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు.ప్రాజెక్టు నీటిని తమ అనుమతి లేకుండా విద్యుత్ వినియోగం కోసం వాడడం నిబందనల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. ఎక్సెస్వాటర్ ఉన్నప్పుడు నీటిని వాడుకుంటే ఇబ్బంది లేదని, కానీ ఇప్పుడు పవర్ జనరేషన్కోసం వాడిన నీళ్లు రైతులకు ఉపయోగపడకుండా సముద్రంలో కలుస్తున్నాయన్నారు.ఉమ్మడి ఏపీలో నీటి ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం గౌరవించడంలేదన్నారు.కృష్ణా రివర్ బోర్డ్ మీటింగ్కు తెలంగాణ ప్రతినిధులు రాకుండా ముఖం చాటేశారని, మరో పక్క మంత్రి కేటీఆర్ మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.దేవుడు చెప్పినా వినమంటూ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని, ఇరుపక్షాలూ కూర్చుని మాట్లాడుకోవాలని మేం కోరుకుంటున్నామన్నారు.బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారమే నడుచుకోవాలని, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులరేటరీ మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు పోతితెడ్డి పాడు ద్వారా రాయలసీమకు నీటిని తరలిస్తున్నామన్నారు.భవిష్యత్లో తమ పోరాటం కొనసాగుతుందన్నారు.ఆయన వెంట ఆంధ్రా పోలీసులు, వైసీపీ నేతలు ఉన్నారు.