Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ఆదివాసీహక్కుల పోరాట యోధుడు స్టాన్ స్వామి మరణంపై న్యాయ విచారణ జరిపించాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం జిల్లాకేంద్రంలోని కుడకుడరోడ్డులోని జగ్జీవన్ రాం విగ్రహం వద్ద ఆయనకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ అడవిపై,ఖనిజ సంపదపై ఆదివాసులదే హక్కు అని జీవిత పర్యంతం పోరాడిన ఉద్యమకారుడు స్టాన్ స్వామి అని కొనియాడారు.కార్పొరేట్‌శక్తులకు,బహుళజాతి కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా ఆయన పోరాడారన్నారు.స్టాన్ స్వామి మరణం నిరంకుశ ప్రభుత్వం చేసిన హత్య అన్నారు.ప్రజాస్వామిక హక్కులకోసం పోరాడుతున్న కార్యకర్తలపై అక్రమ నిర్బంధాన్ని విధిస్తున్న యూఏపీఏ చట్టాని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.భీమా కోరేగావ్ కేసును ఉపసంహరించుకొని హక్కుల కార్యకర్తలందర్ని విడుదల చేయాలని కోరారు. స్టాన్‌స్వామి హత్యపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌జడ్జితో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్ డేవిడ్ కుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు,కొత్తపల్లి శివకుమార్(చంద్రన్న వర్గం),నెమ్మాది వెంకటేశ్వర్లు. రమణాచారి, కోటయ్య,కరీం, అహ్మద్(విరసం)గుండాల సందీప్ డా .ఏ.పున్నయ్య(అసిస్టెంట్ ప్రొఫెసర్)కె. యోగానంద్, ఆర్.లింగయ్య, వెంకయ్య,పి.వీరన్న, పబ్బతి వెంకటేశ్వర్లు,కె. వేణు,బి.వి.రావు, జి.వెంకటేశ్వర్లు, మన్నూరు నాగన్న,చర్లపల్లి వెంకటయ్య, సి.హెచ్.సింహాద్రి, శీనివాసచారి,పుప్పాల రవికుమార్, నర్సిరెడ్డి, సైదులు పాల్గొన్నారు.