Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
నియోజకవర్గ కేంద్రంలోనున్న ఏరియాస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా మార్చాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సయ్యద్ అలీ మూర్తుజా రిజ్వీని ఎమ్మెల్యే భాస్కర్రావు కోరారు మిర్యాలగూడ పర్యటనకు వచ్చిన ఆయన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏరియాస్పత్రిలో డాక్టర్ల కొరతను తీర్చాలని, పీహెచ్సీ కేంద్రాల్లో కేవలం 1500 మందికి మాత్రమే కోవిడ్ టీకా వేయడం జరుగుతుందని, దీని ద్వారా రాబోయే రోజుల్లో కేసులు పెరుగుతున్న దష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో మున్సిపల్ చైర్మెన్ తిరునగరు భార్గవ్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ కేసా రవి, ఎంపీడీవో దేవిక, కమిషనర్ చీమ వెంకన్న, డీఎస్పీ వెంకటేశ్వర్రావు ఉన్నారు.