Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ -కేతెపల్లి
రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి జగదీశ్‌రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. సోమవారం మూసీ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కెసీఆర్ ఆదేశాల మేరకు మూసి ప్రాజెక్ట్ నుండి కుడి, ఎడమ కాలువ ద్వారా వానా కాలం పంటలకు నీరు విడుదల చేశామన్నారు.మంత్రి మాట్లాడుతూ... రైతులందరూ మార్కెట్లను దష్టిలో పెట్టుకొని వ్యవసాయ అధికారులు సూచించిన పద్ధతిలో అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటలను వరి వంగడాలు, మెట్ట పంటలను పండించాలన్నరు. సీఎం కెసిఆర్ ప్రతి ఎకరా భూమి నీరు ఇవ్వలని కష్ణా, గోదావరి నదులలో మన వాట నీళ్ళను ఏవిదంగా తీసుకోవాలని ఎక్కడ రాజీ లేకుండా పోరాటం చేస్తున్నామన్నారు. సీఎం కెసిఆర్ రాత్రి పగలు కష్ట పడి 7 సంవత్సరాల నుండి పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తూ... కొత్త ప్రాజెక్టు లను శంకుస్థాపన చేసి నీళ్ళు ఇస్తున్నరని అని చెప్పారు. విద్యుత్ మోటార్లుకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామన్నారు . అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటలను పండించాలని.. ఎకరాకు 1 లక్ష ఆదాయాన్ని ఇచ్చే పంటలను పండించాలన్నారు. రాష్ట్ర రైతాంగం దేశ రైతాంగానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జెడ్పీచైర్మెన్ దీపిక, సూర్యాపేట మున్సిపల్ చైర్మెన్ అన్నపూర్ణ, నకిరేకల్ మున్సిపల్ ఛైర్మెన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ నకిరేకల్ జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి నగేష్ గౌడ్ ,కట్టంగూర్ జెడ్పీటీసీ తరాల బలరాం ,టీఆర్ఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట్ రెడ్డి, వెంకన్న యాదవ్, పాల్గొన్నారు.