Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
కరోనా ప్రభావం యంత్రాల ప్రవేశంతో గ్రామీణ మహిళలకు ఉపాధి కరువైందని, సంవత్సరానికి కనీసం వంద రోజులు పని దొరకడం లేదని పొదుపు సంఘాలలో మహిళలకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండు చేశారు. సోమవారం కనగల్లు మండల కేంద్రంలో కనగల్లు గ్రామ ఐద్వా మహాసభ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభావతి మాట్లాడుతూ కనీసం చేద్దామన్నా పని లేదని పనుల్లేక సరిఅయిన పౌష్టిక ఆహారం తినలేక అనారోగ్యాల ఫాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో మహిళలకు రక్షణ కరువైందని చట్టాలు ఎన్ని ఉన్నా రక్షణ లేదని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు రేపు జరిగే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం .గ్రామ అధ్యక్షురాలిగా ఇందిరా కార్యదర్శిగా గాజుల జ్యోతి, మరో పది మందితో కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సుశీల అంజమ్మ ,జ్యోతి , ధనమ్మ, ఈదమ్మ ,ఇందిరమ్మ ,రాణి ,సైదమ్మ ,లింగమ్మ ,రాములమ్మ, లక్ష్మమ్మ పాల్గొన్నారు .