Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్
నవతెలంగాణ-మర్రిగూడ
గ్రామాల అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఏ మాత్రం పెండింగ్‌లో ఉన్నా వారం రోజుల్లో మళ్ళీ తిరిగి వచ్చి చూస్తానని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ అన్నారు. సోమవారం మండలంలోని వట్టిపల్లిపరిధిలోని బట్లపల్లి, మర్రిగూడ, రాజపేటతండా, సరంపేట, లెంకలపల్లి గ్రామాల్లోని అవెన్యూ ప్లాంటేషన్, శ్మశానవాటిక,పల్లెప్రకతివనాలను పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ పెండింగ్ సకాలంలో పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులను, అధికారులను ఆదేశించారు. రాజపేటతండాలో అధికారులు సూచించిన చోటా శ్మశానవాటిక నిర్మించాలన్నారు.లెంకలపల్లిలో పల్లెప్రకతివనం మండలంలో కెల్లా బాగుందన్నారు.ఈ కార్యక్ర మంలో దేవరకొండ ఆర్డీఓ గోపిరామ్నాయక్, ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి,జెడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, తహసీల్దార్ దేశ్యనాయక్, ఎంపీడీవో రమేశ్దీనదయాల్, ఎంపీవో ఝాన్సీ, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, నాంపల్లి, చిట్టెంపహాడ్, వడ్డేపల్లి,స్వాములవారిలింగోటం గ్రామాలలో కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ పర్యటించారు.హరితహారం,పారిశుధ్యం, శ్మశానవాటికలు, పల్లెప్రకతివనం, డంపింగ్‌యార్డులు, పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.మహ్మదాపురం గ్రామపంచాయతీలో ఆవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించి సుమారు 10 ఎకరాలలో చేపట్టే బహత్ పల్లెప్రకతివనం ఏర్పాటుకు గుర్తించిన స్థలం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. గ్రామాలలో నాటే మొక్కలను 10 నుంచి 12 ఫీట్లు ఉండే ఎత్తైన మొక్కలు నాటి వెంటనే సపోర్ట్ కర్రలు నాటి ట్రీగార్డ్ పెట్టాలన్నారు.మొక్కల సంరక్షణ కోసం వాచర్స్ని నియామకం చేయాలని చెప్పారు.నాటిన మొక్కల కాపాడే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.నాంపల్లి గ్రామంలో నాగులచెరువు దగ్గర బస్టాండ్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని, వ్యవసాయ అధికారి కార్యాలయ భవనం మంజూరు చేయాలని జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కష్ణారెడ్డిని ఆదేశించారు.అక్కడికి వచ్చిన కొంతమంది రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారు కొనుగోలు చేసిన వరి ధాన్యానికి రైతులకు మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు డబ్బులు రాలేదని కలెక్టర్ దష్టికి తీసుకొచ్చారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ అపూర్వ్‌చౌహన్,జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ శేషుకుమార్, తహసీల్దార్ లాల్‌బహుదూర్, ఎంపీఓ ఈశ్వరయ్య, సర్పంచులు చంద్రారెడ్డి, చందు, లీలప్రియా, పాండు, పంచాయతీ కార్యదర్శులు పెరుమాండ్లఅజరు కుమార్, ఎం.డి. సత్తార్, కిరణ్, వెంకట్, వనజ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.