Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
రెండున్నరేండ్లుగా పెండింగ్‌లో ఉన్న వద్ధుల, వితంతువుల,వికలాంగుల, ఒంటరి మహిళల, వత్తిదారుల పింఛన్లను వెంటనే మంజూరు చేసి, విడుదల చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ముందు ఆ సంఘం ఆధ్వర్యంలో వద్ధులు, వితంతువులు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, వత్తిదారులకు పెండింగ్ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండున్నరేండ్లుగా వద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వత్తిదారులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని చెప్పులరిగేలా ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల ముందు పేదలందరికీ 57 ఏండ్లకే పింఛన్ ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిదని నేటికీ ఇచ్చిన మాటను అమలు చేయలేదని విమర్శించారు.వయోపరిమితిని అడగని ఉద్యోగులకు మాత్రం ఉద్యోగ పరిమితి వయస్సును 63 ఏండ్లకు పెంచిన ప్రభుత్వం పింఛన్లు అడిగిన వృద్ధులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.పేదల రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్లో ఏఓ శ్రీదేవికి అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సోమపంగ జానయ్య,నల్లమేకల అంజయ్య, గుంజ వెంకటేశ్వర్లు, పడమటింటి నగేష్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జంపాల స్వరాజ్యం,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చెరుకుపల్లి మంగయ్య, జిల్లా శ్రీను,వెంకటేశ్వరరావు, రామయ్య, వెంకన్న, రవి పాల్గొన్నారు.