Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
సంచారజాతుల వారికి కేటాయించిన ప్రభుత్వ భూములను తిరిగి వారి అప్పజెప్పాలని మల్లూరి కొండలరావు కోరారు.సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.మండలపరిధిలోని ఖానాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో గల 50/30 సర్వేనెంబర్లో గల ఎకరం ప్రభుత్వ భూమిని 1974లో మా తాతగారైన మల్లూరు రామయ్య సంచారజాతులకు బతుకుదెరువు నిమిత్తం వారికి కేటాయించారన్నారు.కానీ కొంతమంది ఆ భూమిని రాజకీయ అండదండలతో, అధికారుల ప్రోద్బలంతోఎటువంటి అనుమతులు సంతకాలు కూడా లేకుండా కనీసం వారసులమైన తమ ప్రమేయం లేకుండా కొనడానికి.. అమ్మడానికి వీలులేని ప్రభుత్వ భూములను నకిలీ పట్టా పుస్తకాలలో ఎక్కించారని ఆరోపించారు. కేవలం సేద్యం చేసుకోవడానికి పరిమితమైన భూమిని 1992 వ సంవత్సరంలో జంగా కన్నయ్య ,పిన్నబోయిన రాములు తమకు కేటాయించిన ప్రభుత్వ భూములను వారి పేరు మీద పట్టా జారీ చేయించుకున్నారని తెలిపారు.ఈ విషయమై రెవెన్యూ అధికారులను వివరణ కోసం సంప్రదించగా అసైన్డ్ భూములలో చేర్పులు, మార్పులకు సంబంధించి తమవద్ద ఆధారాలు లేవని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి50/30 సర్వేనెంబర్లో గల నకిలీ పట్టాదారులను తొలగించి పేదలకు మంజూరు చేసిన భూమిని వారికే అప్పజెప్పి న్యాయం చేయాలని కోరారు.